HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Local Elections

Local Body Elections : కాస్కోండీ.. స్థానిక ఎన్నికల్లో తేల్చుకుందాం అంటున్న కేటీఆర్‌

Local Body Elections : ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత, పెన్షన్‌ల మోసం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి మాత్రం మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమై కనీసం నగరాన్ని శుభ్రం చేయలేకపోతూ, కొత్త నగరాలను కడతానని పోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు

  • Author : Sudheer Date : 29-09-2025 - 3:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR
KTR

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి(Pradeep Chowdhury)తో పాటు పలువురు వివిధ పార్టీల నేతలు ఎమ్మెల్సీ ఎల్.రమణ (Ramana) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కొనే సత్తా బీఆర్‌ఎస్‌కే ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే గల్లీ స్థాయి ఎన్నికైనా, ఢిల్లీ స్థాయి ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమేనని స్పష్టమవుతోందని ఆయన అన్నారు.

Election Commission : తెలంగాణల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ ..!

కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలకూ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరని ఆయన అన్నారు. ఈ మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు ‘బాకీ కార్డులు’ అనే ఉద్యమాన్ని బీఆర్‌ఎస్ చేపట్టిందని, ఇవి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తాయని చెప్పారు. ఈ కార్డులు కాంగ్రెస్‌కే బ్రహ్మాస్త్రంలా మారతాయని కేటీఆర్ హెచ్చరించారు.

హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్ హయాంలో సాధించిన అభివృద్ధి, పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసుల్లో నిలిచాయని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత, పెన్షన్‌ల మోసం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి మాత్రం మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమై కనీసం నగరాన్ని శుభ్రం చేయలేకపోతూ, కొత్త నగరాలను కడతానని పోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు దేశంలో తెలుగువాడి గౌరవాన్ని ఎన్టీఆర్ నిరూపించగా, తెలంగాణవారి శక్తిని కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ పేర్కొంటూ, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ సునామీలా విస్తరిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • ktr
  • Local Body Elections
  • Local Body Elections Date
  • Local Body Elections schedule
  • OCT 09
  • telangana

Related News

Jeevan Reddy Brs

BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన వెంట సుమారు 40 మంది బలమైన అనుచర గణం

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd