KTR : మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ
దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.
- By Latha Suma Published Date - 04:27 PM, Fri - 30 August 24

KTR : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘హైడ్రా’ కూల్చివేతల పై మీదే చర్చ నడుస్తోంది. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు. దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రియమైన మల్లికార్జున ఖర్గే గారూ.. మీరు చెప్పినట్లుగా ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. తెలంగాణాలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతోంది. మహబూబ్‌నగర్ పట్టణంలో 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు. నిన్న అక్రమంగా కూల్చివేసిన నిరుపేదల్లో 25 కుటుంబాల్లో శారీరక వికలాంగులు కూడా ఉన్నారు. ఆమోదయోగ్యమైన పద్ధతులు పాటించకుండా, విధి విధానాలు లేకుండా అమలు చేసే చట్టం చట్టమే కాదు. అడ్డగోలుగా నిరుపేదలపైకి బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యాంగ మార్చకుండా ఆదేశాలు ఇవ్వండి” అంటూ మల్లికార్జున ఖర్గేకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కాగా, తెలంగాణలో ‘హైడ్రా’ పేరుతో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జులం విధిల్చింది. చెరువులు, కుంటల్లో కబ్జాలు చేసి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనాలు, బిల్డింగులు, ఇళ్లను సైతం బుల్డోజర్లతో కూల్చి వేస్తోంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో పేదలు కూడా ఇళ్లను కోల్పోతున్నారు.
Read Also: Jaishankar : పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది: జైశంకర్