KTR : బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీస్
KTR legal notice : తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని , తన ప్రతిష్ఠకు చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయని
- By Sudheer Published Date - 12:35 PM, Wed - 23 October 24

మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR).. కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు లీగల్ నోటీస్ పంపారు. తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని , తన ప్రతిష్ఠకు చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయని, వారంలోగా క్షమాపణ చెప్పకపోతే లీగల్ చర్యలు తప్పవని లీగల్ నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ నోటీస్ ద్వారా కేటీఆర్, బండి సంజయ్‌పై పరువు నష్టం కేసు వేయడానికి సిద్దమని హెచ్చరిక చేశారు. లీగల్ నోటీస్‌లో పేర్కొన్నట్లు, ఈ వ్యాఖ్యలు బహిరంగంగా, సత్యాధారాలు లేకుండా చేసినవిగా ఆరోపించారుల
కాబట్టి క్షమాపణ కోరారు. మరోపక్క మంత్రి కొండా సురేఖ (Konda Surekha)పై దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణలో కేటీఆర్ నేడు ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ కేసులో మేజిస్ట్రేట్ శ్రీదేవి ఆదేశాల మేరకు కేటీఆర్‌తో పాటు సాక్షులుగా ఉన్న ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ వాంగ్మూలాలను రికార్డు చేయనున్నారు.ఈ కేసు సందర్భంగా, మంత్రి కొండా సురేఖకు కూడా కోర్టు హాజరవాలని నోటీసులు జారీ చేయడంతో ఆమె తనపై దాఖలైన ఆరోపణలపై వివరణ ఇవ్వనున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది, కేసు విచారణ తదుపరి దశల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.
Read Also : Protest : ఆందోళన బాట పట్టనున్న తెలంగాణ రైతులు & ఉద్యోగ సంఘాలు