CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR
CM Revanth : రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా
- By Sudheer Published Date - 07:16 PM, Wed - 24 September 25

తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా వాయిదా వేస్తున్నారన్నది కేటీఆర్ ఆరోపించారు. “చంద్రబాబు ప్రయోజనాల కోసమే రేవంత్ వెనకడుగు వేస్తున్నారు” అని స్పష్టంగా విమర్శించారు.
Bathukamma Kunta: ఎల్లుండి బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కర్ణాటక ప్రభుత్వం తమ ప్రాంతీయ ప్రయోజనాల కోసం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 5 అడుగులు పెంచేందుకు ₹70 వేల కోట్ల భారీ వ్యయం భరించడానికి సిద్ధమైందని ఉదాహరణ ఇచ్చారు. అయితే తెలంగాణలో కాళేశ్వరం నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే, అదే డబ్బులు అవినీతి ముసుగులో తినేశారని కాంగ్రెస్, BJPలు కలసి ప్రచారం చేశారని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రజల కష్టార్జిత డబ్బుతో ఏర్పాటైన మహత్తర ప్రాజెక్టు అని, దాన్ని విమర్శించడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ కలిసి రాష్ట్రాన్ని దారి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ రెండు జాతీయ పార్టీల చెరలో పడకుండా రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని అన్నారు. తెలంగాణను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తున్న జాతీయ పార్టీలు రాష్ట్రాభివృద్ధి పట్ల నిజమైన శ్రద్ధ చూపలేవని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రజలు, ముఖ్యంగా యువత, భవిష్యత్తు తరాల కోసం రాష్ట్ర హక్కులు కాపాడే ఉద్యమంలో ముందుండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.