HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Counter To Amit Shah Over Speech At Chevella

KTR Counter: అమిత్‌షాకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణాలో బీజేపీ పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ పై మాటల దాడి చేస్తుంది. బీజేపీ కామెంట్స్ కి అధికార పార్టీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు

  • Author : Vamsi Chowdary Korata Date : 24-04-2023 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Counter
Whatsapp Image 2023 04 24 At 8.40.16 Am

KTR Counter: తెలంగాణాలో బీజేపీ పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ పై మాటల దాడి చేస్తుంది. బీజేపీ కామెంట్స్ కి అధికార పార్టీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఇరు పార్టీలు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్‌షా తెలంగాణాలో పర్యటించారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.

అమిత్‌షా మాట్లాడుతూ..పేపర్లు లీక్ చేసి లక్షలాది మంది యువత భవిష్యత్తును కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసింది. అవినీతి లేకుండా పరీక్ష కూడా నిర్వహించలేని వారికి అధికారంలో ఉండే అర్హత లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒవైసీ ఎజెండాను అనుసరిస్తారు కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోరు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచం మొత్తం చూసే విధంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామన్నారు. .కేసీఆర్ జీ.. మీ బెదిరింపులకు ఏ ఒక్క తెలంగాణ బిజెపి కార్యకర్త భయపడడు. మిమ్మల్ని గద్దె దించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్‌లను రద్దు చేసి ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు వారి హక్కులు తిరిగి ఇస్తాం అంటూ సంచలన ప్రకటనలు చేశారు. తెలంగాణలో అవినీతి బీఆర్ఎస్ పాలనకు ముగింపు సమయం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు షా. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి మరియు వంశపారంపర్య పాలనతో విసిగిపోయిన ప్రజలు మోదీ గారి నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకుంటున్నారు అంటూ సీఎం కేసీఆర్, మరియు రాష్ట్ర సర్కార్ పై తారాస్థాయిలో హాట్ కామెంట్స్ చేశారు అమిత్‌షా.

అమిత్‌షా కామెంట్స్ పై తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణాలో త్వరలో బీజేపీ వస్తుందని పగటి కలలు కంటున్నారు అది అసాధ్యం. అధికారంలోకి కాదు బీజేపీ అంధకారంలోకి పోతుంది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు కేటీఆర్. త్వరలో తెలంగాణాలో బీజేపీ ఖాళీ అవ్వబోతుంది. అలాగే దేశంలో ప్రధాని కుర్చీ మారబోతుంది అన్నారు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే… దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేనన్నారు. బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కింది. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం విలవిలలాడుతోంది.అంటూఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్.

హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో బీజేపీ ఫుల్ పిక్చర్ అర్ధం అవుతుంది. ఈ పిక్చర్ ని దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు కేటీఆర్. అదేవిధంగా తెలంగాణ బీజేపీపై మండిపడ్డారు ఆయన. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవు. ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు అంటూ విమర్శించారు. ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. .తెలంగాణాలో బీజేపీ నాయకులు ముక్కునేలకు రాసినా… మోకాళ్ల యాత్ర చేసినా… మోసాల మోదీని తెలంగాణ ప్రజలు నమ్మరు. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా తుప్పు పట్టిన తుపాకీతో ఎంఐఎం భుజంపై ఎంతకాలం కలుస్తారంటూ సూటిగా ప్రశ్నించారు.

కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికగా బీజేపీని ఎండగట్టారు. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ అని, పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. అదానీ విషయంలో JPC కాదు కదా కనీసం SIT కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. గుజరాత్ లో మోడీ హయాంలో మీరు హోం మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకులలో గుజరాత్ No – 1 గా ఉన్నమాట నిజం కాదా? అని ఘాటుగా ప్రశ్నించారు. గత ఎనిమిది ఏళ్లలో గుజరాత్ లో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా ? ఈ దేశం లో వ్యాపం లాంటి అతి జుగుప్త్సా కరమైన స్కాం చేసింది మీ BJP పార్టీ ప్రభుత్వం కాదా? అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడం మీకే చెల్లిందని విమర్శించారు. పీఎం నిధిలో ఎంత జమైంది – ఏ విదంగా ఖర్చు అయ్యిందో చెప్పని వారు CAG ఆడిట్ PM cares కు వర్తించదు అని నిస్సిగ్గుగా సుప్రీం కోర్టు లో అఫిడవిట్ వేశారంటూ మండిపడ్డారు. ఎనిమిది ఏళ్లుగా కృష్ణ నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును చదివితే తెలంగాణ ప్రజలు పట్టించుకోరంటూ అమిత్‌షాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

Read More: Amit Shah Sensational Announcement: అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు: అమిత్ షా సంచలన ప్రకటన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • brs
  • Chevella Meeting
  • KTR Counter
  • Tealangana Politics
  • Vijaya Sankalpa Sabha

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • Shiv Sena: థానే ఆసుపత్రిలో మహిళా డాక్టర్, సిబ్బందిపై శివసేన కార్పొరేటర్ దాడి

  • US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులను సమర్థించిన నాటో అధినేత

  • Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

  • kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Cotton: తెలంగాణలో పత్తి సాగుకు వాతావరణ సవాళ్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd