Lasya Nandita: లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్
రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జి లాస్య నందిత కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరామర్శించారు.
- Author : Praveen Aluthuru
Date : 25-02-2024 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
Lasya Nandita: రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జి లాస్య నందిత కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా లాస్యకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు మరియు సెగ్మెంట్ పరిధిలోని స్థానిక బిఆర్‌ఎస్ నేతలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన కేటీఆర్ హైదరాబాద్ వచ్చిన వెంటనే కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. కేటీఆర్ తో పాటు మహమూద్ అలీ, మల్లా రెడ్డి మరియు ఇతర సీనియర్ నాయకులు సంఘీభావం ప్రదర్శించారు.
శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. పటాన్‌చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు పై లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెనుక నుంచి టిప్పర్‌ను ఢీకొనడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి రైలింగ్‌పైకి దూసుకెళ్లాడని తెలిపారు. తలకు బలమైన గాయమై రక్తస్రావంతో ఎమ్మెల్యే మృతి చెందినట్లు తెలుస్తోంది.
దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/JTL25SzykP
— BRS Party (@BRSparty) February 25, 2024