Janwada Farm House Party : జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
Janwada Farm House Party : దావత్ చేసుకోవద్దా..? దావత్ చేసుకునేది కూడా ప్రభుత్వాన్ని అడిగి చేసుకోవాలా..?
- By Sudheer Published Date - 09:57 PM, Sun - 27 October 24

ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పై మీడియా లో రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కు చెందిన ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యవహారం నడిచిందని , పలువురు డ్రగ్స్ తీసుకున్నారని , పెద్ద ఎత్తున విదేశీ మద్యం లభించిందని , ఈ పార్టీ లో కేటీఆర్ భార్య కూడా ఉన్నారని , రాజ్ పాకాల ప్రస్తుతం పరారీలో ఉన్నారని, కేటీఆర్ పై కూడా కేసులు పెట్టబోతున్నారని ఇలా ఏది పడితే అది ..ఎవరికీ తోచినట్లు వాళ్లు మాట్లాడుతూ ..ప్రచారం చేయడం..ఇదే క్రమంలో బిజెపి , కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్..ఈ వ్యవహారం పై మీడియా తో స్పందించారు.
‘అది ఫాంహౌస్ కాదు. నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. గృహప్రవేశం చేసినప్పుడు పిలవలేదని ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడు. లిక్కర్ కూడా ఉండొచ్చు. ఆ పార్టీలో నా అత్తమ్మ (నా భార్య తల్లి) , పిల్లలు , బంధువులు ఇలా అంత ఉన్నారు. దావత్ చేసుకోవద్దా..? దావత్ చేసుకునేది కూడా ప్రభుత్వాన్ని అడిగి చేసుకోవాలా..? రాజకీయంగా తమను ఎదుర్కోలేక తమ బంధువులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కుట్రలతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు..ఇలాంటి చిల్లర ప్రయత్నాలు, కేసులకు తాము భయపడేరకం కాదు. ప్రజల్లో తమపై ఓ దుష్ప్రచారం చేసే భాగంగానే రేవ్ పార్టీ(Rave party) అని ప్రచారం చేసింది. డ్రగ్స్ దొరకలేదని ఎక్సైజ్ అధికారులు(Excise Officers) చెప్పారు. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని అన్నారు.
అసలు డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోండి ఫస్ట్.. టెస్టు చేస్తే 12 మందికి నెగిటివ్, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది..ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారో కనుకోండి.. తమ కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వస్తే.. పలువురు మహిళలు, పలువురు పురుషులు అని వార్తలు రాయడం ఎంత వరకు కరెక్ట్. మీము పబ్లిక్ లో ఉన్నామని చెప్పి..ఏది పడితే అది రాసేసి..ఏది పడితే అది అనేస్తే చెల్లుతుందా..? తాను అక్కడే ఉన్నానని..పోలీసులు వచ్చే 5 నిమిషాల ముందు అక్కడి నుండి వెళ్లిపోయానని ప్రచారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం కేసీఆర్ దగ్గర ఉన్న..అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చి , భోజనం చేసి , కాసేపు టీవీ చూసి..కూతురి తో మాట్లాడి పండుకున్నానని ఉదయం లేచేసరికి ఈ వార్తలు చూసి షాక్ అయ్యాయని తెలిపాడు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గాలికొదిలారు. అన్ని అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం చేస్తూనే ఉంటాం. అనవసరంగా తమ జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం. చావును కూడా లెక్కచేయం అని కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also : SpaceX Crew 8 : 233 రోజుల తర్వాత భూమికి చేరిన వ్యోమగాములు.. ఎలా అంటే ?