Balmoori Venkat : కేటీఆర్, కౌశిక్‌పై ఫైర్.. డ్రగ్స్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చిన అనిల్, బల్మూరి
డ్రగ్స్ నిజ నిర్ధారణ కోసం యూరిన్, డీఓఏ6 డ్రగ్ ప్యానల్ శాంపిల్స్‌ను అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్(Balmoori Venkat) అందించారు.
- By Pasha Published Date - 12:02 PM, Wed - 30 October 24

Balmoori Venkat : డ్రగ్స్ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది. డ్రగ్స్ టెస్టు కోసం శాంపిల్స్ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు మంగళవారం వస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో మంగళవారం రోజు ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. కౌశిక్ రెడ్డి రాక కోసం ఎదురు చూశారు. ఎంతకూ కౌశిక్ రెడ్డి రాలేదు. దీంతో వారు ఇవాళ ఉదయం హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌కు వెళ్లారు. డ్రగ్స్ నిజ నిర్ధారణ కోసం యూరిన్, డీఓఏ6 డ్రగ్ ప్యానల్ శాంపిల్స్‌ను అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్(Balmoori Venkat) అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read :Salman Khan : ‘2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం’.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపు
దమ్ము, ధైర్యం ఉంటే వచ్చి టెస్ట్ శాంపిల్స్ ఇవ్వాలి : అనిల్ కుమార్ యాదవ్
‘‘నిన్న(మంగళవారం) బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇతరులు డ్రగ్స్ టెస్ట్ కోసం ఏఐజీ హాస్పిటల్‌కు వస్తామని చెప్పారు. కానీ వాళ్లు రాలేదు. నేను, మా పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిసి ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లాం. నిన్న రాత్రి 8:30 వచ్చి 10 గంటల వరకు అక్కడే కౌశిక్ కోసం ఎదురుచూశాం. ఇవాళ నేను, మా ఎమ్మెల్సీ కలిసి హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కు వెళ్లి డ్రగ్స్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చాం. బీఆర్ఎస్ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే వచ్చి టెస్ట్ శాంపిల్స్ ఇవ్వాలి’’ అని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.
Also Read :Amit Shah : ఖలిస్తానీల హత్యలు.. హోంమంత్రి అమిత్‌షాపై కెనడా సంచలన ఆరోపణలు
ఈ మధ్య కాలంలో వాళ్లు డ్రగ్స్ తీసుకున్నారేమో.. : బల్మూరి వెంకట్
‘‘ఈ మధ్య కాలంలో కేటీఆర్, కౌశిక్ డ్రగ్స్ తీసుకున్నారేమో.. అందుకే వాళ్లు టెస్ట్ శాంపిల్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణ చేశారు. రాజకీయాల్లో బాధ్యతల గల స్థానాల్లో ఉన్నపుడు, ఏవైనా ఆరోపణలు వస్తే వాటిని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారనే ఆరోపణలు వచ్చాయి.. అయితేే ఆయన టెస్ట్ శాంపిల్స్ ఇవ్వలేదు’’ అని బల్మూరి వెంకట్ తెలిపారు. టెస్ట్‌లకు శాంపిల్స్ ఇస్తే.. ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారో తెలిసిపోతుందన్నారు. శాంపిల్స్ ఇచ్చే ధైర్యం లేనివాళ్లు అడ్డగోలుగా మాట్లాడొద్దని ఆయన చెప్పారు. ఇకనైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదని కౌశిక్‌కు బల్మూరి సూచించారు. దమ్ముంటే టెస్ట్‌లకు శాంపిల్స్ ఇవ్వాలన్నారు.