TG Congress : కాంగ్రెస్ లో మళ్లీ కలహాలు మొదలయ్యాయా..?
TG Congress : దీనిపై సీఎం సైతం సైలెంట్ గా ఉండడం వల్ల పార్టీకి ఎక్కువ డ్యామేజ్ తప్ప మరోటి లేదు. బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే అధినేత కు తెలియకుండా ఎవ్వరు ఏమి మాట్లాడారు..? ఎవరైనా విమర్శలు చేయాలన్న..ముందుగా కేసీఆర్ దగ్గరి వెళ్లి అనుమతి తీసుకునేవారు
- By Sudheer Published Date - 02:44 PM, Thu - 3 October 24

కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిజ స్వరూపం ఏంటో మరోసారి బయటపడుతుంది. కాంగ్రెస్ అంటేనే కలహాల పార్టీ అని మొదటి నుండి ప్రచారం లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో నిత్యం గ్రూప్ తగాదాలు నడుస్తాయని..ప్రజలు , పార్టీ అవసరం లేదు..మాకు మీమే గొప్ప అనే స్వభావం ఉంటుందని..పార్టీలో ఒకరి ఎదుగుదలను ఏమాత్రం జీర్ణించుకోలేరని…పార్టీలో ఓ నేతపై విమర్శలు వస్తే..సదరు నేతకు సపోర్ట్ ఉండడం మానేసి ఇంకాస్త అవతలి వ్యక్తులను రెచ్చగొట్టేలా చేస్తారని..ప్రజల కష్టాలు తెలుసుకోవడం కంటే..గొడవలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారని మొదటి నుండి అంత మాట్లాడుకుంటుంటారు.
ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. రేవంత్ దూకుడు , మాట తీరు చూసే చాలామంది కాంగ్రెస్ ఫై నమ్మకం పెట్టుకున్నారు. ఉచిత హామీలు , రేవంత్ ఏదో చేస్తాడని ప్రజలు భావించి ఓట్లు వేశారు. కానీ ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇప్పుడు అదే ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా..ఆ ప్రజలనే రోడ్డున పడేస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా హైడ్రా నిర్ణయం అనేది కాంగ్రెస్ తీసుకున్న పెద్ద తప్పని అంటున్నారు. ఈ మాట విపక్షాలే కాదు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం పబ్లిక్ గా అంటున్నారు. మూసి సుందరీకరణ లో భాగంగా మూసి పరివాహాక నిర్మాణాలను కూలుస్తున్నామని సీఎం అంటుంటే..మరికొంతమంది మాత్రం హైడ్రా కు మాకు సంబంధం లేదు..సీఎం తీసుకున్న నిర్ణయమే అని అంటున్నారు.
హైడ్రా (Hydraa) తమ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అల్టిమేటం ఇచ్చారు. ఇక మూసీ ప్రక్షాళన విషయంలో పేదల ఇళ్లపై గడ్డపారలు ఎలా దిగుతాయో చూస్తానంటూ మరో నేత మాజీ ఎంపీ మధు యాష్కీ హెచ్చరించడం కూడా పార్టీలో నేతల తీరును సూచిస్తుంది. ఇలా సొంతపార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తుండటం విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ లకు అస్త్రాలుగా మారుతున్నాయి. దాంతో సెల్ఫ్ డిఫెన్స్‌లో రేవంత్ ప్రభుత్వం పడిందన్న చర్చ నడుస్తోంది.
హైడ్రా, మూసీ ప్రక్షాళనపై సామాన్యుడి నుంచి న్యాయస్థానం వరకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సమంత అడ్డుపెట్టి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు, సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దీంతో అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఓ మాట అనేటప్పుడు ఆచితూచి అనాలి..ఆ మాటల వల్ల పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుంది..? వారి మనోభావాలు దెబ్బతీస్తాయి కదా..? సమాజంలో ఎంతో గుర్తింపు ఉన్న ఫ్యామిలీ ఫై అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా..? అనేది కూడా తెలియకుండా వ్యవహరిస్తున్నారు. దీనిపై సీఎం సైతం సైలెంట్ గా ఉండడం వల్ల పార్టీకి ఎక్కువ డ్యామేజ్ తప్ప మరోటి లేదు. బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే అధినేత కు తెలియకుండా ఎవ్వరు ఏమి మాట్లాడారు..? ఎవరైనా విమర్శలు చేయాలన్న..ముందుగా కేసీఆర్ దగ్గరి వెళ్లి అనుమతి తీసుకునేవారు..కానీ కాంగ్రెస్ లో మాత్రం ఆలా కాదు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండడం తో ప్రజల్లో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ ఫై నమ్మకం పోతుంది. మరి ఇప్పటికైనా నేతల తమ తీరు మార్చుకుంటారా..? లేక మాకు మీమే అన్నట్లు ముందుకు వెళ్తారా..? అనేది చూడాలి.
Read Also : Fake SBI Branch : ఫేక్ ఎస్‌బీఐ బ్రాంచ్ బట్టబయలు.. రూ.లక్షలు కుచ్చుటోపీ.. ఉద్యోగాలు అమ్ముకున్న వైనం