Komatireddy : కేసీఆర్ ఢిల్లీ గుట్టువిప్పిన కోమటిరెడ్డి
రెండు నెలలుగా రైతులు దీనావస్థలో ఉంటే, కేసీఆర్ వరిధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించాడు.
- By Hashtag U Published Date - 03:55 PM, Sat - 27 November 21

రెండు నెలలుగా రైతులు దీనావస్థలో ఉంటే, కేసీఆర్ వరిధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించాడు. రెండు రోజుల వరి దీక్షలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించాడు. తెలంగాణ రైతులను మోసం చేయొద్దని కేసీఆర్ కు హితవు పలికాడు. ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలివి.
- కేసీఆర్ వేల కోట్లు దోచుకుని, రైతులను మోసం చేస్తున్నాడు. పనికి రాని మంత్రులతో ఢిల్లీలో రాజకీయం చేస్తున్నాడు.
- నాలుగు రోజులు ఢిల్లీలో ప్రధాని మోడీని కలవడానికి ప్రయత్నంచేయలేదు. కేవలం చీఫ్ సెక్రటరీ, కేటీఆర్ కొందరు అధికారులను కలవడానకి ప్రయత్నించి వెనక్కు వచ్చాడు.
- మానవత్వంలేని సీఎం డబ్బు ఆర్జన కోసం ప్రయత్నం చేస్తున్నాడు. హుజురాబాద్ ఎన్నికల్లో దళితులకు ఇస్తానన్న డబ్బు ఏమైంది. కాళేశ్వరం పేరు చెప్పి దోచుకున్న కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు.
- రైతుబంధు ఇస్తానంటోన్న కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు చేయడంలేదు. రైతులను మోసం చేస్తున్నాడు. రుణమాఫీ చేస్తానని మోసం కేసీఆర్ మోసం చేశాడు. సోనియా వద్దన్నా…వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ను అమలు చేశాడు. రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది.
- రియల్ ఎస్టేట్, మిల్లర్లతో కుమ్మకై కేసీఆర్ దోచుకుంటున్నాడు. కాళేశ్వరం కట్టడం ద్వారా అవినీతికి పాల్పడ్డాడు. గోదావరి,కృష్ణా నీటిని ఆంధ్రాకు కేసీఆర్ వదిలేశాడు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని యూటర్న్ తీసుకున్నాడు. దరిద్రుడు, సన్నాసి ఇప్పుడు మూడు ఎకరాలు ఇస్తానని ఎప్పుడన్నా అంటూ కేసీఆర్ వ్యాఖ్యనించడం ఏమిటని ప్రశ్నించాడు. కేసీఆర్ నాలుక కోయాలి.
- సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే నాలుగు కుటుంబాలకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఇలా అనుకోలేదని సోనియా బాధ పడుతున్నారు. ఎలాగైనా కేసీఆర్ ను అధికారం నుంచి దింపడమే తెలంగాణకు విముక్తి.
- కోటి మంది రైతులు రోడ్డున పడ్డారు. వరి ధాన్యం అమ్ముకోవడానికి కుళ్లిపోయిన అన్నం తింటున్నాడు. రైతులు బాధ వర్ణానాతీతం. ఎన్నో బాధలు పడుతోన్న రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలి.
- నిజామాబాద్ ఎమ్మెల్యే 12 కోట్ల రోల్స్ రాయస్ కారులో తిరుగుతున్నాడు. భూ కబ్టాలు చేస్తూ టీఆర్ఎస్ నేతలు జల్సాలు చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి సోయలేదు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రైతులకు ఇలాంటి బాధ ఎందుకు వచ్చిందో..పార్లమెంట్లో తేల్చుతాం.
- వ్యవసాయ చట్టాలపై పోరాడిన రైతులను ఆదర్శంగా తీసుకోవాలి. మూర్ఖుడైన సీఎం కేసీఆర్ మెడలు వంచాలంటే ఢిల్లీ పై పోరాడిన రైతులను ఆదర్శంగా తీసుకుని పోరాడాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. పోరాటం చేద్దాం రండి.
- రైతులు దౌర్భాగ్యాన్ని, దరిద్రపు రోజులను రైతులు ఎప్పుడూ చూడలేదు. రెండు నెలలుగా ధాన్యం కొనుగోలుకు నోచుకోలేదు. తేమశాతం, రంగు పేరుతో ధాన్యం కొనుగోలును నిరాకరించకుండా ప్రభుత్వం వ్యవహరించాలి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేయాలి. యాసంగి కోసం కాకుండా ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయండి.
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాగుడు, డబ్బు చుట్టూ తిప్పుతున్నారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. అన్నదాతకు న్యాయం చేసే పోరాటం చేయడం జన్మధన్యం అయినట్టే. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలి. కళ్లాల్లో ధాన్యం ఎక్కువ మంది కౌలు రైతులవే. ఆత్మహత్యలు చేసుకుంటున్నది కూడా కౌలు రైతులే. రైతుల విషయంలో సీఎం కేసీఆర్ మానవత్వంతో వ్యవహరించాలి. పైన దేవుడు, కింద ప్రజలు ఉన్నారు. రైతులను ఆదుకోకపోతే దేవుడే శిక్షిస్తాడు. ధాన్యం కొనుగోలు చేసే వరకు పార్టీ పరంగా రైతులకు అండగా నిలుస్తాం.
Related News

Telangana: రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నాయకుడు: కేటీఆర్ గరం
రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ నేతగా వర్ణిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తోందని,