HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Komati Reddy Rajagopal Reddy And Vivek May Join In Congress Tomorrow

Vivek -Rajagopal Reddy : కాంగ్రెస్‌లోకి వివేక్, రాజగోపాల్ రెడ్డి.. కారణం అదేనా ?

Vivek -Rajagopal Reddy : ఇద్దరు కీలక నేతలు తెలంగాణ బీజేపీకి షాక్ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

  • Author : Pasha Date : 23-10-2023 - 2:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vivek Rajagopal Reddy
Vivek Rajagopal Reddy

Vivek -Rajagopal Reddy : ఇద్దరు కీలక నేతలు తెలంగాణ బీజేపీకి షాక్ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ మళ్లీ తమ సొంతగూడు కాంగ్రెస్ కు చేరుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అటు రాజగోపాల్ రెడ్డి కానీ.. ఇటు వివేక్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మంగళవారం రోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వీరిద్దరూ హస్తం పార్టీతో చెయ్యి కలిపే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు. దీనిపై  తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

రాజగోపాల్‌రెడ్డి ఏమన్నారంటే.. ?

ఈ ప్రచారంపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘ కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి నాపై పెరుగుతోంది’’ అని వెల్లడించారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పొత్తుల్లో భాగంగా మునుగోడు నుంచి ఒకవేళ సీపీఐ బరిలోకి దిగితే.. తాను స్వయంగా అక్కడ పోటీ చేస్తానని రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బరిలోకి దిగితే.. తాను ఎల్‌బీ నగర్‌ నుంచి పోటీ చేస్తానని, తన భార్యకు మునుగోడు టికెట్ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి అడిగినట్లు సమాచారం. అయితే మునుగోడు నుంచే పోటీ చేయాలని, వేరే టికెట్ ఇచ్చేది లేదని బీజేపీ నాయకత్వం ఆయనకు స్పష్టం చేసిందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

వివేక్ వెంకటస్వామి బీజేపీ తరఫున చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని భావించారట. చివరకు ఆయన ధర్మపురి అసెంబ్లీ స్థానం కావాలని బీజేపీని డిమాండ్ చేశారట. కానీ తొలి జాబితాలో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచి ఎస్. కుమార్ ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఆయన ఇక కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడమే బెటర్ అనరే అభిప్రాయానికి వచ్చారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, వివేక్ ధర్మపురి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం నడుస్తోంది. ఇందులో ఏది ఎంత నిజం అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read: 400 Deaths – 24 Hours : 24 గంటల్లో 400 మంది హతం.. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ ఎటాక్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Komati Reddy Rajagopal Reddy
  • Vivek -Rajagopal Reddy
  • Vivek Venkat Swamy

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd