BJP – Janasena : జనసేనకు కటీఫ్.. తెలంగాణలో సర్వేలకు అందని స్థాయిలో సీట్లు సాధిస్తాం : కిషన్ రెడ్డి
BJP - Janasena : 2024 లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
- By Pasha Published Date - 05:37 PM, Fri - 15 December 23

BJP – Janasena : 2024 లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జనసేనతో ఇక పొత్తులు ఉండవని వెల్లడించారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఫలితాలను సాధిస్తుందని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పొత్తు వల్ల జనసేన, బీజేపీలకు కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేలు జరగలేదు. జనసేన పోటీ చేసిన ఎనిమిది చోట్ల బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంక్ కూడా జనసేనకు అనుకూలంగా పనిచేయలేదు. ఈ కారణం వల్లే వచ్చే లోక్‌సభ పోల్స్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతామని కిషన్ రెడ్డి ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో జనసేనను దూరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో ఏపీలో కూడా ఇక బీజేపీతో కలిసే అవకాశం(BJP – Janasena) ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ నుంచి బయటకు రాలేదు. కానీ పొత్తుల గురించి బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల వల్ల పరస్పర ఉపయోగం ఉంటేనే, బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తుందని పరిశీలకులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేమని అభిప్రాయపడుతున్నారు.