Telangana CM : తెలంగాణ సీఎం పదవిపై ఖర్గే క్లారిటీ
రేవంత్ కు సీఎం పదవి ఖాయమని భావిస్తున్నా..సీనియర్ల అభ్యంతరాలతో ఈ అంశం కొత్త మలుపు తీసుకుంటోంది
- Author : Sudheer
Date : 05-12-2023 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం (Telangana CM) ఎవరా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందు నుండి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ప్రకటన విషయంలో గందరగోళం ఏర్పడుతుందని..పార్టీలో సీనియర్లంతా సీఎం కుర్చీ కోసం కొట్లాడతారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది..ఆ ఆరోపణలు ఇప్పుడు నిజం అయ్యాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ (congress Party) గెలిచిందో..వెంటనే సీనియర్లంతా సీఎం పదవిపై వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు సీఎం కుర్చీ లొల్లి ఢిల్లీ వరకు వెళ్ళింది.
We’re now on WhatsApp. Click to Join.
రేవంత్ (Revanth Reddy) కు సీఎం పదవి ఖాయమని భావిస్తున్నా..సీనియర్ల అభ్యంతరాలతో ఈ అంశం కొత్త మలుపు తీసుకుంటోంది. సీఎం రేసులో ఉన్న భట్టి..ఉత్తమ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో కలక మంతనాలు జరగనున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ సీఎం పదవిపై ఖర్గే కీలక ప్రకటన చేసారు. పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశానికి వెళ్తూ ఖర్గే ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది సాయంత్రానికల్లా వెల్లడిస్తామని చెప్పారు.
కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకుగాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించడానికి సోమవారమే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన ఖర్గేతో సమావేశమై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే ఛాన్సుంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్‌లు డీకేఎస్‌తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది.
Read Also : Rahul Gandhi: తుఫాన్ బాధితులకు అండగా నిలబడండి, కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు