Lok Sabha Elections : ఖమ్మం ఎంపీ బరినుండి తప్పుకున్న రాయల నాగేశ్వరరావు
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీ గా నామినేషన్ వేసిన రాయల నాగేశ్వరరావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు
- Author : Sudheer
Date : 26-04-2024 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో నామినేషన్ల (Nominations) పర్వం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడగా, అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. నిన్న గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వానికి ఫుల్ స్టాప్ పడింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 731, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు దాఖలు కాగా.. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు నామినేషన్లను పరిశీలిస్తున్నారు. ఈనెల 29 వరకు ఉపసంహరణ గడువు ఉండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా నామినేషన్ వేసిన రాయల నాగేశ్వరరావు (Rayala Nageswara Rao) తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశానుసారం తన నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నానని నాగేశ్వరరావు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలనీ కార్యకర్తలకు , ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఖమ్మం లోక్సభ స్థానానికి 45 మంది 72 సెట్లు, మహబూబాబాద్ స్థానానికి 30 మంది 56 సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఖమ్మం ఎంపీ బరిలో రఘురాంరెడ్డి (కాంగ్రెస్), నామా నాగేశ్వరరావు (BRS), తాండ్ర వినోదారావు(BJP) అభ్యర్థులు బరిలోకి ఉండగా.. మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ నుండి బలరాంనాయక్ , బిఆర్ఎస్ నుండి కవిత , బిజెపి నుండి సీతారాంనాయక్ నామపత్రాలు సమర్పించారు.
Read Also : Mrunal Thakur : మాజీ బోయ్ ఫ్రెండ్ ను గుర్తు చేసుకుని హీరో చెంప చెల్లుమనిపించిన మృణాల్..!