Bye Bye Ganesha: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేషుడు!
కట్టుదిట్టమైన భద్రత మధ్య శుక్రవారం హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం జరిగింది.
- By Balu J Published Date - 08:59 PM, Fri - 9 September 22

కట్టుదిట్టమైన భద్రత మధ్య శుక్రవారం హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం జరిగింది. హైదరాబాద్ లో 10 రోజుల గణేష్ ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ప్రతి సంవత్సరం వినూత్న రూపంలో దర్శనమిస్తాడు. ప్రముఖ వేదాంతవేత్త విఠ్ఠల శర్మ ఆలోచనతో ఈ ఏడాది మట్టి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, రాజేంద్రన్, కన్వీనర్ సందీప్ పరాజ్ రూపకర్తతో కలిసి గణపతి విగ్రహాన్ని రూపొందించారు.
గత రెండేళ్లుగా ప్రజలు అనారోగ్యం , ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి శుభం కలగాలనే ఉద్దేశ్యంతో మహాలక్ష్మీ పంచముఖ (పంచముఖ) గణపతి విగ్రహాన్ని రూపొందించాలని ఉత్సవ కమిటీకి విఠల శర్మ సూచించారు. గణపతికి ఐదు ముఖాలు రక్షణ కల్పిస్తాయని, లక్ష్మీగణపతిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, సంపదలు లభిస్తాయని తెలిపారు.