HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Key Developments Regarding Local Body Elections In Telangana

Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం

Local Body Elections : తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపటితో (జూలై 25)గా రిజర్వేషన్ల ఖరారుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందన ఎంత త్వరగా వస్తుందన్నది ఉత్కంఠగా మారింది

  • Author : Sudheer Date : 24-07-2025 - 7:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Election Schedule
Election Schedule

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్‌ను గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖకు పంపించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్డినెన్స్‌లను గవర్నర్ ఆమోదించాల్సిన బాధ్యత ఉంది. అయితే కొన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో గవర్నర్, కేంద్ర హోంశాఖ న్యాయ సలహాను కోరవచ్చు. ఇదే మేరకు అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులతో చర్చల అనంతరం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపటితో (జూలై 25)గా రిజర్వేషన్ల ఖరారుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందన ఎంత త్వరగా వస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేంద్రం నుంచి 24 గంటల్లో నిర్ణయం రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగేందుకు రెండు మార్గాలు మాత్రమే ఉంటాయి. హైకోర్టును ఆశ్రయించి మరింత గడువు కోరడం లేదా పాత రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగించడం. ఈ రెండు మార్గాల్లో ఏదైనా తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఆధారపడి ఉంది.

Tragedy : ఘోరం.. మల్టీ మిలియనీర్ CEOను తొక్కి చంపిన ఏనుగు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న హామీతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్. ఈ అంశంపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేసింది. ఈ విషయంలో కేంద్రం నుంచి సహకారం లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని చికాకులో పడేసింది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అలాగే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ రఘునందన్ రావు లాంటి నాయకులు మతరాజకీయ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీనివల్ల కేంద్రం వైఖరి ఇంకా అనిశ్చితంగా ఉంది.

ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత లేకపోవడం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని పెంచుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా మారిన తరుణంలో, కేంద్ర–రాష్ట్రాల మధ్య సంయమితంగా చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. లేదంటే రిజర్వేషన్ల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రజాప్రతినిధి సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కావడం తథ్యం. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jishnu dev varma governor
  • Local Body Elections
  • telangana
  • Telangana High Court

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd