TSRTC : గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ భూముల లీజు.. ఎందుకు ?
TSRTC : మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పడిపోయింది.
- Author : Pasha
Date : 30-12-2023 - 10:22 IST
Published By : Hashtagu Telugu Desk
TSRTC : మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీకి ఉన్న భూములను లీజుకు ఇవ్వాలని డిసైడ్ చేసింది. తద్వారా సంస్థ నిర్వహణ కోసం కొంత ఆదాయాన్ని గడించవచ్చని నిర్ణయించింది. ఆర్టీసీ భూములను లీజుకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌లో ఈ – టెండర్లు దాఖలు చేయొచ్చు. దీనికి లాస్ట్ డేట్ జనవరి 18. భూముల వేలానికి సంబంధించి పూర్తి వివరాలను https://www. tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు.
- కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలను లీజుకు ఇస్తారు.
Also Read: Fight With Partner : భార్యాభర్తల గొడవ.. ఆ టైంలో ఈ పదాలు వాడొద్దు సుమా!
రూ.400 కోట్లతో 1050 కొత్త బస్సులను తెలంగాణ సర్కారు ఆర్టీసీ కోసం కొనుగోలు చేస్తోంది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో 500 బస్సులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వాడకంలోకి తెస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో ఇవాళ 80 కొత్త బస్సులను(TSRTC) ప్రారంభించారు. వాటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులున్నాయి.