HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcrs Coverts In Bjp The List Is Ready

KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!

సేమ్ టూ సేమ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వేటాడిన కోవర్ట్ పాలిటిక్స్ ఇప్పుడు బీజేపీని వణికిస్తోంది. తెలంగాణ బీజేపీలోని కోవర్ట్ (KCR's Coverts)ల జాబితా బయట పెడతానంటూ పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలనం రేపారు.

  • By CS Rao Published Date - 02:09 PM, Sun - 11 June 23
  • daily-hunt
KCR's Coverts
Resizeimagesize (1280 X 720)

KCR’s Coverts: సేమ్ టూ సేమ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వేటాడిన కోవర్ట్ పాలిటిక్స్ ఇప్పుడు బీజేపీని వణికిస్తోంది. తెలంగాణ బీజేపీలోని కోవర్ట్ (KCR’s Coverts)ల జాబితా బయట పెడతానంటూ పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలనం రేపారు. అంటే ఆయన కూడా బీజేపీకి గుడ్ బై చెబుతున్నారని టాక్ మొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూలంగా మారతాయని, బీజేపీ నుంచి ఆ పార్టీలోకి వలసలు ఖాయమంటూ విశ్లేషణలు వెలువడుతున్న వేళ నందీశ్వర్ గౌడ్ పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలో బీజేపీ కీలక నేతల్లో ఒకరైన పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆసక్తికరమైన పరిణామానికి దారితీశారు. భాజపాలో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవర్టుల పేర్లను భాజపా పెద్దలకు చెప్పానని , కోవర్టుల తీరు మారకపోతే పేర్లను మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. ఆ కోవర్టులెవరో త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. మరో 15 రోజుల్లో సంచలన లిస్ట్ బయటకు వస్తుందని చెప్పడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమ రాజకీయ భవిష్యత్తుపై అటు రాష్ట్ర నేతలు.. ఇటు కేంద్ర నేతలు దృష్టి సారించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పార్టీ, టికెట్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న ఖమ్మం కీలక నేతలు పొంగులేటి, జూపల్లి కృష్ణరావులు ఏ పార్టీలో చేరాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని స్పష్టమైన సమాచారం. ఏఐసీసీ వర్గాలు కూడా అదే నిజమని నిర్థారిస్తున్నాయి.

Also Read: Chandrababu: చంద్రబాబుకు ‘సువేరా’ సంచలన రిపోర్ట్..!

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 20న లేదా 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభ వేదికగా ఈ ఇద్దరూ తన అనుచరగణంతో హస్తం గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ రానున్నట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరిని పార్టీలోకి తీసుకురావడానికి రాహుల్ గాంధీ టీం బాగా కష్టపడ్డట్లు తెలుస్తుంది. కాగా మొదట వీరు బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తరువాత షర్మిల పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఉన్న పార్టీలోనే చెబుతూ వస్తున్న పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. .ఇప్పటికే భట్టి విక్రమార్క పాదయాత్ర ముగిసే అవకాశం ఉంది. ఆ సభ తర్వాత ఈ చేరికలు ఉండవచ్చు.

మరోవైపు ఈ ఇద్దరు నేతలు తమ పార్టీలో చేరే అవకాశం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పిచ్చాపాటిగా మీడియాకు చెప్పడంతో.. వీళ్లిద్దరూ కాంగ్రెస్ లోకి వెళ్లడం దాదాపు లాంఛనమే అనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. ఆ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా పడింది. తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి రాజకీయంగా బలపడుతున్న బీజేపీకి కర్నాటక ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరిన తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి ? కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరింతగా పెరుగుతాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్ళతో పాటు నందీశ్వర్ గౌడ్ బయట పెట్టె కోవర్ట్ వ్యవహారం బీజేపీని ఇరకాటంలో పడేయనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • cm kcr
  • KCR's Coverts
  • telangana
  • ts politics

Related News

Kavitha Bc Bandh

BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

BC Bandh: హైదరాబాద్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రద్దీగా ఉండే రోడ్లు ఈరోజు అసాధారణంగా ఖాళీగా మారాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కువగా డిపోలకే పరిమితం కావడంతో నగర రవాణా వ్యవస్థ దెబ్బతింది

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

  • Bhatti Vikramarka

    Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

  • Cctv Camera In Bathroom

    CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

Latest News

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

  • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

  • Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd