HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Will Take Oath As Mla Tomorrow

KCR : రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం..

  • Author : Sudheer Date : 31-01-2024 - 10:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Will Take Oath As Mla On February 1
Kcr Will Take Oath As Mla On February 1

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) రేపు గజ్వేల్ ఎమ్మెల్యే (Gajwel MLA)గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలంతా హాజరుకాబోతున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి..అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ తన ఫామ్‌ హౌస్ లో కింద పడడంతో తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తుంటి ఎముక సర్జరీ అనంతరం ఫామ్ హౌస్ లో ఉంటూ డాక్టర్ల సూచన మేరకు కొద్దీ రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ ఎమ్మెల్యేగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర పాలన సాగించారు. కానీ ఈ దఫా కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం కానున్నారు. గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని ఇప్పటికే శాసనసభాపతి అయిన గడ్డం ప్రసాద్ కు లేఖ రాయడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు. కనీసం ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి ఆ లేటర్ ను గవర్నర్ క ఓస్డీ ద్వారా పంపించారు. అటు తొమ్మిదేండ్ల పాటు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యావాదాలు తెలుపలేదు. ఇటు హుందాగా బీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకోలేదు. మొత్తంగా నిశ్శబ్దం లోకి వెళ్లిపోయారు. రేపు ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమైనా మాట్లాడతారా అనేది చూడాలి. ప్రస్తుతం ప్రతిపక్ష బాధ్యత కేటీఆర్ వహిస్తున్నాడు. ఇక ఆ బాధ్యత కేసీఆర్ తీసుకుంటారు కావొచ్చు.

Read Also : Fruits: ఈ పండ్లు తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gajwel MLA
  • kcr

Related News

Psr Saval Kcr

Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు

    Latest News

    • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

    • హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

    • జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

    • ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    Trending News

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd