HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Strategy Against Bjp In State

KCR Startegy: బీజేపీపై టీఆర్ఎస్ పోరుబాట.. కేసీఆర్ వ్యూహమేంటి?

వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది.

  • Author : Siddartha Kallepelly Date : 18-12-2021 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR-KTR

వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది. తాజాగా కేంద్రంపై పోరాటంలో భాగంగా కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకు కొత్త ప్రోగ్రామ్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు తో పాటు కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20 అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చెయ్యాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈనెల 20న గ్రామ, మండల , జిల్లా స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు కాల్చి నిరసనలు తెలలపాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.

మరోసారి ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని, కేంద్రమంత్రిని కలిసి ధాన్యం కొనమని విజ్ఞప్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. బీజేపై దండయాత్ర చేయాలని, వినూత్న రీతిలో నిరసనలు తెలిపాలని కేసీఆర్ నిర్ణయించారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీతో తాడోపేతో తేల్చుకుందామని, మంత్రులందరిని కార్యక్రమాలు రద్దుచేసుసొని ఢిల్లీ వెళ్ళమని కేసీఆర్ సూచించారు. వరి ధాన్యం పై కేంద్రమంత్రులను కలవాలని, కేంద్ర మంత్రులు సమయం ఇవ్వకుంటే అక్కడే కూర్చొవాలని కేసీఆర్ మంత్రులకు చెప్పారు. ధాన్యంపై ఎదో ఒకటి తేల్చుకున్నాకే తెలంగాణకు రావాలని, రైతుల గోస చూసి తాను షెడ్యూల్ చేసుకున్న జిల్లా పర్యటనలు కూడా రద్దు చేసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

అయితే తమిళనాడు పర్యటనలో స్టాలిన్ తో భేటీ తర్వాత కేసీఆర్ స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఎన్ని మాట్లాడినా బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటేననే అభిప్రాయం చాల రాష్ట్రాల నేతల్లో ఉంది. అందుకే బీజేపీపై సీరియస్ గా పోరాడితేనే తన సీరియస్ నెస్ ఇతర రాష్ట్రాల నాయకులకు అర్ధమై వాళ్ళు తనతో కలిసొస్తారని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవం కోసం ఆహ్వానించడానికి త్వరలోనే కేసిఆర్ అన్ని రాష్ట్రాల సీఎంలను కలవనున్నారని సమాచారం. ఆ పర్యటనలోనే పలు ప్రాంతీయ పార్టీలతో కూడా సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. యాదాద్రి టెంపుల్ కోసం ఆహ్వానించడానికి వెళ్లినా ఆ భేటీల్లో తప్పకుండా రాజకీయాల ప్రస్తావన వస్తుంది కాబట్టి ఆ లోపు బీజేపీపై సీరియస్ గా వరుసగా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కేసీఆర్ అనుకున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమాలతో కేసీఆర్ కు చాలా లాభాలే ఉన్నాయి.రైతుల సమస్యపై సీరియస్ గా కొట్లాడుతున్నందుకు తెలంగాణ రైతులు, బీజేపీ వ్యతిరేకులు తమ వెంట ర్యాలీ అయ్యే అవకాశముంది. మంత్రులు ఢిల్లీకి వెళ్లి నిరసనలు తెలపడం ద్వారా జాతీయ స్థాయిలో పలు ప్రాంతీయ పార్టీల దృష్టిని కేసీఆర్ ఆకర్షించగలుగుతారు. దాంతో కేసీఆర్ కలలుకంటున్న థర్డ్ ఫ్రంట్ తో కలిసొచ్చే పార్టీల సంఖ్య పెరగడంతో పాటు ఆ ఫ్రంట్ లీడ్ చేయగల కెపాబిలిటీ కేసీఆర్ కు ఉందనే అభిప్రాయం పలు ప్రాంతీయ పార్టీల్లో కలిగే అవకాశముంది. ఇవన్నీ కలిసొస్తాయనే కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు కార్యక్రమం ఇచ్చినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • CK KCR
  • telangana
  • Telangana Rashtra Samithi (TRS)

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd