KCR : బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ..రజతోత్సవ సభ ఏర్పాట్ల పై చర్చ!
కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభ విజయవంతం అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన నేతలకు పలు సూచనలు చేశారు.
- By Latha Suma Published Date - 08:05 PM, Fri - 18 April 25

KCR : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ మహిళా నేతలతో పాటు పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపై అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేశారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం పై చర్చినట్లు తెలుస్తుంది.
Read Also: Credit Card Loan vs Personal Loan: ఏ లోన్ మంచిది? క్రెడిట్ కార్డా లేకపోతే పర్సనల్ లోనా?
అంతేకాక.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభ విజయవంతం అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్‌పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్ పర్సన్ రజినీ సాయిచంద్, నవీన్ ఆచారి, పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ