HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Is Drowning Maharashtra Farmers Says Ys Sharmila

YS Sharmila: తెలంగాణాలో 119 మంది రైతులకు సీట్లు ఇవ్వాలి: షర్మిల

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-05-2023 - 2:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila (2)
Ys Sharmila (2)

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతుల్ని ముంచింది కాకా ఇప్పుడు మహారాష్ట్ర రైతుల్ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడని ఎండగట్టారు వైఎస్ షర్మిల. ఈ రోజు శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. కెసిఆర్ నిర్ణయాలను తప్పు పట్టడమే కాకుండా అధికార యంత్రాంగంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటిపాలవ్వడంతో తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇక నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల పలు జిల్లాలను సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ ని టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో గత 9 ఏళ్లలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె అన్నారు. తెలంగాణ రైతుల్ని మోసం చేస్తూ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిందామె.

ఈ రోజు శనివారం వైఎస్ షర్మిల సీఎం కెసిఆర్ ని టార్గెట్ చేస్తూ… తెలంగాణ రైతుల్ని మోసం చేయడమే కాకుండా ఇప్పుడు మహారాష్ట్ర రైతుల్ని మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్రలో రైతు రాజ్యం రావాలనే కెసిఆర్ తెలంగాణాలో కూడా ఆ ప్రకటన అమలు చేయగలవా అంటూ సూటిగా ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటె తెలంగాణాలో ఓ రైతుని సీఎం చేయాలని, క్యాబినెట్లోకి రైతులు మంత్రులుగా ఉండాలని, అలాగే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజవర్గంలో రైతులకి సీట్లు ఇచ్చి నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు తొమ్మిదివేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా కెసిఆర్ అంటూ వైఎస్ షర్మిల సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read More: Karnataka Government : సీఎం, డిప్యూటీ సీఎంలుగా సిద్ధరామయ్య, డీకే ప్రమాణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 9000 farmers
  • cm kcr
  • Maharashtra Farmers
  • suicide
  • telangana
  • telangana farmers
  • ys sharmila

Related News

Notification for the recruitment of Anganwadi teacher posts!

Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్

    Latest News

    • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

    • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

    • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

    • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

    • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd