HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Is A Good Guy I Am A Rowdy Type Kavitha Warns Congress Leaders

Kavitha : కేసీఆర్ మంచోడు.. నేను రౌడీ టైప్.. కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కవిత

కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని కవిత అన్నారు.

  • Author : Latha Suma Date : 15-04-2025 - 6:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR is a good guy.. I am a rowdy type.. Kavitha warns Congress leaders
KCR is a good guy.. I am a rowdy type.. Kavitha warns Congress leaders

Kavitha : బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్ర‌సంగించారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని కవిత అన్నారు.

Read Also: PM Modi : మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన

బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేది లేదు. వాళ్ల తాతలు, ముత్తాలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ అని కవిత అన్నారు. మరోవైపు మాట తప్పడం, మడమ తిప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వం నైజం అని గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలం చెందిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యతను కవిత తీసుకున్నారు. పార్టీ సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ లో నిర్వహిస్తున్న బహిరంగసభకు పెద్ద ఎత్తున ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రజల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కవిత పార్టీ నేతలపై జరుగుతున్న వేధింపులు, బెదిరింపులపై తరచుగా స్పందిస్తున్నారు. తాను పింక్ బుక్ నిర్వహిస్తున్నానని అందులో పేర్లు రాసుకుంటున్నానని అంటున్నారు. ఈ క్రమంలో తాను రౌడీ టైప్ అని బెదిరించడం వైరల్ గా మారుతోంది.

Read Also: IND vs BAN: బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banswada
  • brs party
  • BRS Silver Jublee celebrations
  • congress leaders
  • kavitha

Related News

Kalvakuntla Kavitha

Kavitha New Party Announcement : రేపే కవిత కొత్త పార్టీ ప్రకటన

కవిత కొత్త పార్టీ ప్రకటన చేయనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పార్టీ పేరు ఏమిటి? ఈ పార్టీ ఏ ఓటు బ్యాంకును చీల్చబోతోంది? మరియు ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది? అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది

    Latest News

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    • చిన్నస్వామి స్టేడియంలో దొంగల బీభత్సం!

    • కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd