Telangana Suicides: ఆత్మహత్యలకు కేసీఆర్ కుటుంబం బాధ్యత వహించాల్సిందే1
సమస్య ఏదైనా కావచ్చు తెలంగాణాలో ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో నాలుగవ స్థానంలో ఉంది.
- By Praveen Aluthuru Published Date - 06:15 PM, Sun - 16 July 23

Telangana Suicides: సమస్య ఏదైనా కావచ్చు తెలంగాణాలో ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో నాలుగవ స్థానంలో ఉంది. 2020 తో పోల్చుకుంటే 2021లో ఆ సంఖ్య ఘననీయంగా పెరిగింది. దాదాపు 31 శాతం పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. బంగారు తెలంగాణ అని చెప్పుకునే రాష్ట్రంలో ఆత్యహత్యలకు పాల్పడం ఆందోళనకు గురి చేస్తుంది. రైతులే కాకుండా ఇళ్ల మంజూరు, విద్యార్థులు, జీతాలు రాక, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు ఇలా ఎంతో మంది ప్రభుత్వం నుంచి సాయం అందక మరణిస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మహత్యలకు కెసిఆర్ కుటుంబం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు షర్మిల. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఇలా పోస్ట్ పెట్టారు. దొర పాలనలో జనాలకు ఆత్మహత్యలే శరణ్యం. ఉరి తాళ్ళే దిక్కు.ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, జీతాలు రాక ఉద్యోగులు.. నాలాగా మరొకరికి కష్టం రాకూడదని లేఖలు రాసి మరీ ప్రాణాలు వదులుతున్నారు.చివరికి పథకాలు దక్కాల్నన్నా గుండెలు ఆగాల్సిందే. జీతాల కోసం,పథకాల కోసం చేసుకొనే ఆత్మహత్యలు దొర బంగారు పాలనకు నిదర్శనం. నల్లగొండలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన దంపతులను పొట్టనపెట్టుకున్న పాపం బందిపోట్ల అధ్యక్షుడు కేసీఆర్ దే. గతంలో జీతాలు రావడం లేదని భర్త మహేశ్ ఆత్మహత్య చేసుకుంటే.. భార్య పుష్పలత సైతం అదే కారణంతో ప్రాణాలు విడిచింది. అనాథలైన ఇద్దరి బిడ్డల శాపం ఈ సర్కారుకు కచ్చితంగా తగులుతుంది.
Also Read: Telangana Politics: రైతుతో రాజకీయమా ?
అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పే మంత్రి హరీష్ రావుకైనా మిషన్ భగీరథ కార్మికుల కష్టాలు పట్టడం లేదు. ఇక చిన్న దొర ఇలాకాలో ఇల్లు రాలేదని చనిపోయిన రాజు మృతికి కేటీఆర్ బాధ్యత వహించాలి. సిరిసిల్లలో ప్రభుత్వ పథకాలు అందని గడపే లేదని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. రాష్ట్రాన్ని నడిపేందుకు 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా పథకాలకు డబ్బు లేదు.జీతాలు ఇవ్వడానికి, పెంచడానికి రూపాయి లేదు. బంగారు తెలంగాణలో దొర కుటుంబం బంగారమైతే..పేదలకు బ్రతుకు భారమైంది. కేసీఆర్ ను YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. మిషన్ భగీరథలో పని చేసే 16 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాన్ని పెంచండి. వారికి ఉద్యోగ భద్రత కల్పించండి.ఇంకో కుటుంబం ప్రాణాలు తీసుకోక ముందే మొద్దు నిద్ర వీడండి అంటూ కల్వకుంట్ల కుటుంబానికి సూచించారు వైఎస్ షర్మిల.