Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు..!
ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈడీ , సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ కుటుంబం బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు.
- By Hashtag U Published Date - 11:55 AM, Tue - 17 May 22
ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈడీ, సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ కుటుంబం బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబం గత 8 ఏళ్ల కాలంలో భారీగా ఆస్తులను కూడపెట్టుకుందన్నారు. తమపై ఎలాంటి విచారణ జరగకుండా కేసీఆర్ సర్కార్.. బీజేపీకి కోట్లు రూపాయలు ఇస్తోందన్నారు. మనదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఆ రాష్ట్రాలకు కేసీఆర్ నిధులు సమకూర్చుతున్నారని తెలిపారు. కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్న బీజేపీ.. కేసీఆర్ ప్రభుత్వంపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు ఎందుకు చేయించడంలేదంటూ ప్రశ్నించారు. కర్నాటకలో యడ్యూరప్పను తొలగించిన బీజేపీ.. కేసీఆర్ విషయలో ఎందుకు మౌనంగా ఉంటుందంటూ విరుచుకుపడ్డారు.
ఈ మధ్యే ఉదయ్ పూర్ నిర్వహించిన కాంగ్రెస్ చింతన్ శివిర్ లో కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ భారత్ జోడో యాత్రను తెలంగాణ నుంచి ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాము.. ఉదయ్ పూర్ లో ఆమోదించిన తీర్మానాన్ని మేము ఆమోదించాము. రాహుల్ గాంధీ భారత్ జోడో కార్యక్రమాన్ని తెలంగాణ నుంచే ప్రారంభించాలని కోరినట్లు రేవంత రెడ్డి తెలిపాయి. అయితే ఈ కార్యక్రమంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదన్నారు.
పార్టీ డిజిటల్ సభ్వత్వం విషయంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణనే ముందుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. డిజిటల్ మెంబర్ షిప్ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకంటే ముందుంది. అంతేకాదు దేశంలోనే చర్చనీయాంశమైన రైతు సంఘర్షణ సభ కూడా నిర్వహించాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ నుంచే ప్రారంభిస్తామని చెప్పారు.
Tags
Related News
KCR Reacts On Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి ప్రధాని మోడీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు.