HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Equips Trs Mps To Take On Modi Centre

TRS MPs: తగ్గేదేలే…కేంద్రంతో ఇక టీఆర్ఎస్ తాడోపేడో

పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమయింది. ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు.

  • Author : Naresh Kumar Date : 17-07-2022 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM kcr and telangana
CM KCR Telangana

పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమయింది. ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో పోరాడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. పార్లమెంటులో నిరసనలు తెలియజేయాలని మరియు అనేక కీలక అంశాలను లేవనెత్తాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్రాన్ని పార్లమెంట్‌లో ఎండగట్టాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్రానికి అన్యాయం చేయడంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టాలని, ప్రజల ఆకాంక్షలను కూడా ప్రతిబింబించాలని ఎంపీలకు సూచించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులకు గురి చేయడాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని కెసిఆర్ ప్రత్యేకంగా చెప్పినట్టు తెలిసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణపై కేంద్రప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేయాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల ఎంపీలను కూడా టీఆర్‌ఎస్‌తో చేర్చుకోవాలని ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ఎంపీలతో స్పష్టంగా చెప్పారు. ఇటీవలే విలేఖరుల సమావేశంలో మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన కేసీఅర్ అదే స్ఫూర్తిని కొనసాగించాలని తన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ఇవాళ జరిగిన అఖిల పక్ష సమావేశానికి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ హాజరు కాలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • parliament
  • pm modi
  • state vs centre
  • trs
  • TRS Mps

Related News

Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భారతదేశంలో తయారైన తొలి ఎయిర్‌బస్ సి-295 విమానాన్ని ప్రదర్శించారు. స్వదేశీ రక్షణ తయారీ, ఏరోస్పేస్ సామర్థ్యాలు మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో దీని పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వడోదరలో 40 విమానాలను నిర్మించనున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఆదివారం, భారతదేశంలో తయారైన తొ

  • Delhi Police have tightened security at Jantar Mantar in view of the Parliament march.

    Jantar Mantar: పార్లమెంట్ మార్చ్ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు

  • Vikram-1 launch today; PM Modi supports Skyroot mission, describing it as a historic milestone.

    Vikram-1: విక్రమ్-1 ప్రయోగం నేడు.. స్కైరూట్ మిషన్‌కు ప్రధాని మోదీ మద్దతు.. దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు

Latest News

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

  • Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd