KCR Bus With Lift: కేసీఆర్ బస్సుకు లిఫ్ట్.. డిజైన్ మాములుగా లేదుగా..
సీఆర్ బస్సు యాత్రను మొదలు పెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. అయితే తుంటి గాయం నేపథ్యంలో బస్సు పైకి ఎక్కడం కష్టంగా మారింది. అందువల్ల అతని సౌలభ్యం కోసం బస్సు లోపల ఒక లిఫ్ట్ ఏర్పాటు చేశారు
- By Praveen Aluthuru Published Date - 10:25 PM, Fri - 26 April 24

KCR Bus With Lift: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ మేరకు 17 రోజుల బస్సు యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు కేసీఆర్ నాలుగు నెలల పాటు ప్రజలకు, పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బాత్రూమ్ లో జారి పడటంతో తుంటికి గాయమైంది. దీంతో డాక్టర్ల సూచనా మేరకు కేసీఆర్ నాలుగు నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
కేసీఆర్ పార్టీకి దూరంగా ఉండటంతో కొందరు నేతలు పార్టీని వీడటం మొదలు పెట్టారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సీనియర్లు సైతం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. బస్సు యాత్రను మొదలు పెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. అయితే తుంటి గాయం నేపథ్యంలో బస్సు పైకి ఎక్కడం కష్టంగా మారింది. అందువల్ల అతని సౌలభ్యం కోసం బస్సు లోపల ఒక లిఫ్ట్ ఏర్పాటు చేశారు. సూర్యాపేట రోడ్‌షో సందర్భంగా బస్సుపైకి వెళ్లేందుకు కేసీఆర్ లిఫ్ట్‌ను ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మే 10వ తేదీన సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో కేసీఆర్ బస్సు పర్యటన ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తమ పార్టీని పునరుజ్జీవింపజేయాలని భావిస్తున్నారు.
Also Read: Pithapuram: పవన్ ని ఓడించేందుకు కుట్ర..పిఠాపురంలో 80 లక్షల మద్యం సీసాలు..