Telangana Politics: కేసీఆర్ స్కీంలన్నీ స్కాములే
అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు అంటూ షర్మిల చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా సీఎం కెసిఆర్ పై ఆరోపణలు చేస్తున్న షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు
- By Praveen Aluthuru Published Date - 05:09 PM, Sat - 15 July 23

Telangana Politics: అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు అంటూ షర్మిల చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా సీఎం కెసిఆర్ పై ఆరోపణలు చేస్తున్న షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల. పేదలకు దక్కాల్సిన స్కీంలన్నీ బిఆర్ఎస్ దొంగల పాలవుతున్నాయి అంటూ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి దళిత బంధు వరకు అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని ఆరోపించింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నింట్లో బందిపోట్ల దోపిడీలే ఉన్నారంటూ మండిపడింది. ఏ పథకం పేదలకు అందలే.. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకే. 9 ఏళ్లుగా ఊరించి ఊరించి ఇచ్చిన అరకొర 4 లక్షల పోడుపట్టాలను సైతం కేసీఆర్ అండ్ కో వదిలిపెట్టలే. గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటు అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు వైఎస్ షర్మిల.
అర్హులను పక్కననెట్టి డబ్బులు ముట్టజెప్పిన వారికే పోడు పట్టాలు ఇవ్వడం కేసీఆర్ అండ్ బ్యాచ్ కే చెల్లింది. గిరిజనుల స్థానంలో బీఆర్ఎస్ లీడర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పోడు పట్టాలు పొందడం దొరగారి పాలన దక్షతకు నిదర్శనం. YSR తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తోంది… పోడు పట్టాల పంపిణీలో మీ డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీరు పంచిన 4 లక్షల ఎకరాల్లో పట్టాలు ఎంతమంది అర్హులకు ఇచ్చారు? ఎంతమంది అనర్హులకు కట్టబెట్టారు? ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు ఇవ్వడం ఏంటి? గిరిజనులకు బదులు గిరిజనేతరులకు ఎలా పట్టాలు ఇచ్చారు? పట్టాల కోసం దరఖాస్తు పెట్టని వాళ్లకు ఎలా పట్టాలు ముట్టజెప్పారు? వెంటనే ఒక విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు
Read More: Volunteer System: వాలంటీర్ వ్యవస్థను పవన్ రద్దు చేస్తారా?