Kavitha Suspended : కవిత సస్పెన్షన్ ఏమాత్రం సరికాదు – జాగృతి నేతలు
Kavitha Suspended : హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయానికి చేరుకున్న అభిమానులు, నేతలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవితకు మద్దతుగా నిలుస్తూ, ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు
- By Sudheer Published Date - 08:15 PM, Tue - 2 September 25

బి.ఆర్.ఎస్.పార్టీ కవితను సస్పెండ్ (Kavitha Suspended) చేయడంపై ఆమె అభిమానులు, జాగృతి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వివరణ తీసుకోకుండా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి కూడా తెలియకుండా సస్పెండ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం పార్టీకి నష్టం కలిగిస్తుందని, తెలంగాణలో కవితకు ఉన్న ప్రజాదరణను గుర్తించకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని జాగృతి నేతలు అంటున్నారు.
Kavitha Suspended : కవిత సస్పెండ్.. BRS కు మరింత నష్టం జరగబోతుందా..?
జగదీశ్ రెడ్డి, హరీష్ రావుల తీరుపై జాగృతి నేతలు మండిపడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలైన వారు కవిత సస్పెన్షన్ విషయంలో కనీస స్పందన చూపకపోవడం దారుణమని, వారికి కూడా ఈ కుట్రలో భాగం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయానికి చేరుకున్న అభిమానులు, నేతలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవితకు మద్దతుగా నిలుస్తూ, ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కవిత సస్పెన్షన్ వ్యవహారం బి.ఆర్.ఎస్. పార్టీలో కొత్త కలకలం సృష్టించింది. ఒకవైపు పార్టీ నేతలు ఈ విషయంపై మౌనంగా ఉండగా, మరోవైపు కవిత మద్దతుదారులు బహిరంగంగా నిరసనలకు దిగారు. కవిత భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.