MLC Kavitha: కవిత కాంగ్రెస్ లోకి వస్తానంటే వద్దనను – పొంగులేటి
MLC Kavitha: కవిత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమైతే తాను అడ్డుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 08:40 AM, Sat - 31 May 25

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) గురించి జరుగుతున్న చర్చను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్రంగా కొట్టిపారేశారు. ఆమె అంశాన్ని ‘టీ కప్పులో తుపాన్’ లా అభివర్ణించారు. “ఒకరు ఆడమంటారు.. మరొకరు ఆడతారు” అంటూ ఆయన రాజకీయ విమర్శలు గుప్పించారు. గతంలో BRS ప్రభుత్వంలో ఎంతో మంది నేతలు తప్పుడు పనులు చేశారని, ఇప్పుడు వారి తప్పులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
Fortuner: నదిలో ఇరుక్కున్న కారు… శంకరనారాయణన్ వచ్చాడు, లాగేశాడు!
మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరో కవితే చెప్తుంది అని పరోక్షంగా ఆమెపై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. గత ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ, తప్పుడు పాలనతో నష్టాన్ని కలిగించిందని, ఇప్పుడు ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడం తప్పేమీ కాదన్నారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు వారి పూర్వకర్మలపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
MI vs GT Eliminator: ఉత్కంఠ పోరులో గెలిచిన ముంబై.. టోర్నీ నుంచి నిష్క్రమించిన గుజరాత్!
ఇక కవిత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమైతే తాను అడ్డుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పార్టీకి రావాలనుకునే వారిని ఆపడం తమ ధోరణి కాదని, ఎవరి రాజకీయ భవిష్యత్తు వారికి తెలియాల్సిన విషయమని చెప్పారు. అయితే ఇటీవలి రాజకీయ పరిణామాలు చూస్తే, కవిత భవిష్యత్ రాజకీయాలు ఏవిధంగా మలుపుతీస్తాయో అని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.