Kavitha : చతుర్ముఖ వ్యూహం ఫెయిల్, బండి వ్యాఖ్యల హైలెట్!
ఢిల్లీ లిక్కర్ కేసు వేధింపుల్లో భాగమని బీఆర్ఎస్(Kavitha) చెబుతోంది.
- By CS Rao Published Date - 03:00 PM, Sat - 11 March 23

ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ వేధింపుల్లో భాగమని బీఆర్ఎస్(Kavitha) చెబుతోంది. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆ స్కామ్ (Delhi liquor scam)ను బయటపెట్టింది తామేనంటూ బయటకు వస్తోంది. తొలుత సీబీఐకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఫిర్యాదు చేశామని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేర్ చెబుతున్నారు. హస్తిన వేదికగా ఆయన శనివారం మీడియాముందుకొచ్చారు. మరో వైపు బీజేపీ వేధింపులు అంటూ బీఆర్ఎస్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసనలకు దిగింది. అలాగే, హైదరాబాద్ లోనూ బైబై మోడీ పోస్టర్లతో ఆందోళనకు దిగింది. లిక్కర్ కేసుకు సంబంధించి సౌత్ గ్రూప్ లీడర్ గా కవితను ఈడీ గుర్తించింది. అందుకు ప్రతిగా బీజేపీ క్షక్ష్య సాధింపు అంటూ తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు వివిధ రకాల నిరసనలకు బీఆర్ఎస్ దిగింది. ఆ పార్టీకి ఎంఐఎం కూడా మద్ధతు పలుకుతోంది.
ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ వేధింపుల్లో భాగమని..(Kavitha)
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని(Kavitha) మోడీ సర్కార్ టార్గెట్ చేసిందని అసరుద్దీన్ ట్వీట్ చేశారు. సహజ మిత్రత్వ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) మూలాలను కదిలించామని చెప్పుకుంటోంది. దేశంలోని ప్రధాన జాతీయ పార్టీల్లో ఒకటిగా ఉన్న కాంగ్రెస్ మాత్రం లిక్కర్ స్కామ్ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి చూస్తోంది. గతంలో ఈడీ దాడులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్ మీద జరిగాయి. హెరాల్డ్ కేసు సందర్భంగా ఈడీ వాళ్లను ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో మోడీ సర్కార్ మీద కాంగ్రెస్ విరుచుపడింది. కానీ, ఇప్పుడు కవిత ఉన్న లిక్కర్ స్కామ్ సందర్భంగా జరుగుతోన్న విచారణకు మద్ధతు పలకడం గమనార్హం.
విచారణ సందర్భంగా కేసీఆర్ చతుర్మఖ వ్యూహాన్ని …
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) విచారణ సందర్భంగా చతుర్మఖ వ్యూహాన్ని కేసీఆర్ రచించారు. కానీ, ఆ వ్యూహాలు ఫలించేలా కనిపించడంలేదు. ఎందుకంటే, సోషల్ మీడియా వేదికగా కవిత(Kavitha) అరెస్ట్ కు మద్ధతుగా పలు రకాలు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె తలమీద లిక్కర్ సీసాలు పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. బతుకమ్మ పేరు రాజకీయ లబ్ది పొందిన ఆమె సారా వ్యాపారం చేస్తూ దొరికిపోయారని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కవిత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. పలు రకాలు సెటైర్లు వేస్తూ కల్వకుంట్ల కుటుంబం వ్యవహారాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ సమాజంతో పాటు నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఫలితంగా కేసీఆర్ వేసిన రాజకీయ ఎత్తుగడ పారడంలేదు. న్యాయస్థానాల్లోనూ ఆయన వేసిన వ్యూహం అనుకూలంగా కనిపించలేదు. విపక్షాల మద్ధతు కూడగట్టుకోవడంలోనూ ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వైఫల్యం చెందింది. కేవలం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మినహా మిగిలిన పార్టీల లీడర్లు ఆ వేదికపై కనిపించలేదు.
Also Read : KCR on Kavitha Case: కవిత అరెస్ట్ పై కేసీఆర్, 99 శాతం ఫిక్స్!
క్షేత్రస్థాయి, న్యాయ, రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో కేసీఆర్ మొదటిసారిగా వెనుకబడ్డారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయి నిరసనలకు ధీటుగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోరాడుతున్నారు. దీంతో కవిత(Kavitha) అరెస్ట్ కారణంగా ఏ మాత్రం సానుభూతిని పొందలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. ఇక న్యాయపరంగా పోరాడాలని భారతదేశంలోని ప్రముఖుల్ని సంప్రదించినప్పటికీ కవితను బయట వేసే పరిస్థితి కనిపించడంలేదు. రాజకీయ వ్యూహాలకు ధీటుగా బీజేపీ దూకుడుగా వెళుతోంది. పైగా విపక్షాలన్నీ బీఆర్ఎస్ పార్టీ కి సంబంధించిన లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) ను తెలంగాణకు ముడిపెట్టడానికి ఏ మాత్రం అంగీకరించడంలేదు. అక్రమ సారా వ్యాపారం చేస్తోన్న కవితను అరెస్ట్ చేయాలని విపక్షాలన్నీ మూకుమ్మడిగా కోరుకోవడం గమనార్హం. దీంతో కేసీఆర్ రాజకీయ వ్యూహం దాదాపుగా వైఫల్యం చెందినట్టే. ఇక ఢిల్లీ లాబీయింగ్ ఒక్కటే మిగిలింది. అక్కడ కూడా ఏ మాత్రం అవకాశం లేకుండా బీజేపీ ఢిల్లీ పెద్దలు స్కెచ్ వేశారని వినికిడి.
బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోరు జారిన పదాన్ని హైలెట్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోరు జారిన పదాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ హైలెట్ చేస్తోంది. మహిళా రిజర్వేషన్ కావాలని శుక్రవారం రోజు ఢిల్లీలో కవిత(Kavitha) చేసిన దీక్షకు పోటీగా హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద బండి అండ్ టీమ్ దీక్షలకు దిగింది. ఆ సందర్భంగా కవిత అరెస్ట్ గురించి మాట్లాడుతూ `అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకున్నారా..` అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బండి దిష్టిబొమ్మలను తగులబెడుతూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ చతుర్ముఖ వ్యూహం వైఫల్యం చెందడంతో బండి నోరుజారిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ హైలెట్ చేస్తోంది.
Also Read : MLC Kavitha: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్

Related News

Bandi Sanjay: కాంగ్రెస్‌కు ‘శని’గా మారిన రాహుల్: బండి సంజయ్
మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.