HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Enters The Brs Cm Race Is It Certain That She Will Compete With Ktr

Kavitha CM Race: సీఎం రేసులోకి కవిత.. కేటీఆర్‌తో పోటీ ఖాయమేనా ?

ఇంతకీ కవిత(Kavitha CM Race)కు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌లో ప్రచారం చేస్తున్న నేతలు ఎవరు ?

  • Author : Pasha Date : 13-05-2025 - 5:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha Cm Race Brs Ktr Kcr Telangana Politics

Kavitha CM Race: ‘‘రాబోయే కాలంలో మీరు సీఎం అవుతారు’’ అంటూ ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే ఎరుకుల నాంచారమ్మ సోది జోస్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కవిత నిజంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం పోస్టుకు గురిపెట్టారా అనే టాక్ మొదలైంది. ఎరుకుల నాంచారమ్మ చెప్పిన సోది జోస్యం వినగానే కవిత మురిసిపోయారు. జై తెలంగాణ అంటూ నినదించారు. అదే రోజు మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ‘‘ నాపై కొందరు సొంత పార్టీ నేతలే పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారెవరో నాకు తెలుసు. సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read :Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !

కీలకమైన పార్టీ పదవి కోసమేనా.. ? 

ఇంతకీ కవిత(Kavitha CM Race)కు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌లో ప్రచారం చేస్తున్న నేతలు ఎవరు ? వారిని అలా ఎంకరేజ్ చేస్తున్న ప్రధాన నేత ఎవరు ? అనేది తెలియాల్సి ఉందని బీఆర్ఎస్‌లోని కవిత వర్గీయులు అంటున్నారు.  మొత్తం మీద బీఆర్ఎస్‌లో జరుగుతున్న వర్గపోరు ఇప్పుడు బయటికి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ వర్గపోరు తీవ్రరూపు దాల్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి కంటిన్యూగా దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది. రెండుసార్లు కూడా కేసీఆరే సీఎం పదవిని చేపట్టారు. తన కుటుంబీకులకు ఇతర పదవులను ఆయన కట్టబెట్టారు. కుమారుడు కేటీఆర్‌కు అత్యంత కీలకమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. కవితకు మాత్రం అంతటి  స్థాయి కలిగిన పదవేదీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అందుకే ఆమె నైరాశ్యంతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

కవితకూ అన్ని అర్హతలు

ఇప్పుడు కీలకమైన పార్టీ పదవిలో(బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా) కేటీఆర్ ఉన్నందున.. భవిష్యత్తులో బీఆర్ఎస్ మరోసారి గెలిచే పరిస్థితులు వస్తే కేటీఆర్‌కే సీఎం సీటు దక్కుతుందనే ఆందోళన కవితలో ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తనకూ ఆ స్థాయి కలిగిన పార్టీ పదవిని కవిత ఆశిస్తున్నారని అంటున్నారు. రాజకీయ అవకాశాల కోసం మహిళలూ పోరాడితే తప్పేముంది ? తెలంగాణ ఉద్యమంలో కవిత కూడా చాలా క్రియాశీలంగా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నెట్‌వర్క్‌ను బాగా పెంచారు. ప్రత్యేకించి మహిళల్లో బీఆర్ఎస్ పార్టీకి క్రేజ్ పెరిగేందుకు కవిత ప్రధాన కారకులు అయ్యారు. అందుకే బీఆర్ఎస్‌లో కీలక స్థానం కోసం పోటీపడే అర్హతలన్నీ కవితకు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఒకవేళ కవితకు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌లో ఇలాగే ప్రతికూల ప్రచారం కొనసాగితే.. రాజకీయం అనూహ్య మలుపు తిరిగే అవకాశం ఉంది. కవిత సొంతంగా రాజకీయ బాటను వేసుకునే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Virat Kohli Diet : విరాట్ కోహ్లీ డైట్ ప్లాన్.. ఏం తింటాడు ? ఏం తినడు ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS CM Race
  • CM Race
  • kavitha
  • Kavitha CM Race
  • kcr
  • ktr
  • telangana
  • telangana politics

Related News

Principles Of The Kavitha P

Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

కవిత ప్రకటించిన కొత్త పార్టీ కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరిగేదిగా కాకుండా, బలమైన వ్యవస్థల మీద ఆధారపడి నడుస్తుందని ఆమె స్పష్టం చేశారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు 'లీడర్ సెంట్రిక్' (నాయకుడి ప్రాధాన్యత)గా ఉంటాయి

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

Latest News

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd