Kavitha :ఉత్కంఠకు తెర, మళ్లీ ఈడీ నోటీసులు,20న విచారణ
లిక్కర్ స్కామ్ లో కవితను(Kavitha) విచారించే అంశంపై ఉత్కంఠకు తెరపడింది.
- By CS Rao Published Date - 02:49 PM, Thu - 16 March 23

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను(Kavitha) విచారించే అంశంపై ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈనెల 20వ తేదీన విచారణకు రావాలని ఆమెకు మళ్లీ ఈడీ (ED Notices) నోటీసులు జారీ చేసింది. ఆ రోజున ఆమె వెళ్తారా? మళ్లీ మరో విధంగా కవిత వ్యూహం రచిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, రామచంద్రపిళ్లై విచారణ ముగిసింది. వాళ్లను కోర్టులో హాజరు పరచడానికి ఈడీ రంగం సిద్దమయింది.
కవితను విచారించే అంశంపై ఉత్కంఠకు తెర (Kavitha)
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి సౌత్ గ్రూప్ లీడర్ గా లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా కవిత(kavitha) ఉన్నారు. ఆమెను విచారించడానికి ఈడీ ముప్పుతిప్పలు పడుతోంది. స్వతహాగా సిసోడియా న్యాయవాది అయినప్పటికీ ఆయన్ను ఈడీ తేలిగ్గా విచారించింది. కానీ, కవిత మాత్రం న్యాయ పరిధుల్లో ఉన్న లొసుగులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందంటూ ఈడీ మీద అభియోగాలను మోపారు. విచారణ నుంచి తప్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు పరిచారు. ఈనెల 24వ తేదీన సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ను విచారించనుంది. అప్పటి వరకు ఏదో ఒక విధంగా ఈడీ(ED Notices) విచారణ నుంచి తప్పించుకోవాలని కవిత ఎత్తుగడలు వేస్తున్నారు.
Also Read : ED Kavitha : ఢిల్లీలో హైడ్రామా, విచారణ,అరెస్ట్ పై ఉత్కంఠ
వాస్తవంగా ఈడీ ఇచ్చిన నోటీసులు(ED Notices) ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు కవిత విచారణకు హాజరు కావాలి. కానీ, ఆమె హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనని రాతపూర్వకంగా ఆమె లాయర్ అందచేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, తొలిసారి ఈనెల 11న చేసిన విచారణ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అడిగింది. వాటిని లాయర్ ద్వారా ఆమె ఈడీకి అందచేశారు. విచారణ సందర్భంగా మహిళకు ఉండే న్యాయబద్దమైన వెసులబాటుల మేరకు ఈడీ నడుచుకోవాని ఆమె (Kavitha) లాయర్ చెబుతున్నారు. ఆమెకు ఎక్కడ వీలుంటే అక్కడకు వచ్చి ఈడీ విచారణ చేయాలని కోరుతున్నారు. సాయంత్రం 6గంటల లోపు విచారణ ముగించాలని ఉన్న క్లాస్ ను చూపిస్తున్నారు.
20న విచారణకు రావాలని మళ్లీ ఈడీ నోటీసులు
హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ ను ఈడీ విచారించింది. ఆ సందర్భంగా ఇలాంటి ఇబ్బందులను ఈడీ ఎదుర్కోలేదు. కానీ, కవిత(Kavitha) విషయంలో మాత్రం కొన్ని అనుభవాలను చవిచూస్తోంది. అంతేకాదు, కవిత ను విచారించిన రోజే లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయంపై వాగ్మూలం ఇచ్చిన రామచంద్రపిళ్లై దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆ మేరకు ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను విచారించిన మరుసటి రోజు ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే, ఈడీ (ED Notices) విచారణ నుంచి లాబీయింగ్ ద్వారా కవిత తప్పించుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఆ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తొలి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతోన్న రాజకీయ గేమ్ గా చెబుతోంది. ఈనెల 20వ తేదీన మళ్లీ కవిత అరెస్ట్ ఎపిసోడ్ తెరమీదకు రానుంది. ఆ రోజున ఏమి జరుగుతుంది? అనే దానిపై ఆసక్తి పెరిగింది.
Also Read : ED Case on Kavitha: ఈడీ అరెస్ట్ నుంచి కవిత తప్పించుకోలేదా?

Related News

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు