ED Kavitha : ఢిల్లీలో హైడ్రామా, విచారణ,అరెస్ట్ పై ఉత్కంఠ
ఢిల్లీ కేంద్రంగా కవిత ఇంటి(ED Kavitha) వద్ద హైడ్రామా నడుస్తోంది. ఆమె (Delhi)ఉదయం 10 గంటలకు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలి.
- By CS Rao Published Date - 12:42 PM, Thu - 16 March 23

ఢిల్లీ కేంద్రంగా కవిత ఇంటి(ED Kavitha) వద్ద హైడ్రామా నడుస్తోంది. ఆమె (Delhi)ఉదయం 10 గంటలకు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలి. కానీ, విచారణ నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదని తెలుస్తోంది. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ వ్యూహాత్మకంగా బుధవారం రాత్రి నుంచి మీడియా ప్రచారానికి కవిత దిగారు. ఆ తరువాత ఉదయం ఆరోగ్యం బాగాలేదని ఈడీకి సమాచారం ఇచ్చారు. కానీ, ఈడీ మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ క్రమంలో ఢిల్లీలో ఉన్న మంత్రులు హరీశ్, కేటీఆర్ హైదరాబాద్ లోని సీఎం కేసీఆర్ నడుమ గేమ్ నడిచింది. ఢిల్లీలో భారీ లాబీయింగ్ కూడా నడిచిందని పార్టీ వర్గాల్లోని చర్చ. అయినప్పటికీ కవిత విచాణకు హాజరు కావాల్సిందేనంటూ ఈడీ హుకుం జారీ చేసింది. దీంతో మధ్నాహ్నం తరువాత విచారణకు హాజరు కావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఢిల్లీ కేంద్రంగా కవిత ఇంటి వద్ద హైడ్రామా (ED Kavitha)
ఢిల్లీలో(Delhi) గురువారం ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 11న కవిత తొలి విచారణకు హాజరైన సందర్భంలో నెలకొన్ని ఉత్కంఠను మించింది. ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీస్, జాతీయ మీడియా, బీఆర్ ఎస్ శ్రేణులు సమక్షంలో హైడ్రామా నడుస్తోంది. తొలుత ఉదయం 10 గంటలకు కవిత మీడియా ముందుకు రానుందంటూ న్యూస్ బయటకు వచ్చింది. ఆ తరువాత దాన్ని 10:30 గంటలకు మార్చారు. కానీ మధ్నాహ్నం 12. 30 గంటల వరకు ఆమె కేసీఆర్ నివాసం నుంచి బయటకు రాలేదు. 11 గంటలకు ఈడీ(ED Kavitha) ఎదుట హాజరు కావాల్సి ఉన్నా బయటకు రాలేదు.
Also Read : Kalvakuntla Kavitha: ఈడీ విచారణ వేళ.. కవితకు సుప్రీంకోర్టు షాక్!
కవిత ఈడీ (ED Kavitha)విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నివాసంలో కవిత.. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు తదితరులతో పాటు న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. అనంతరం 11:30 సమయంలో ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో ఈడీ అడిగిన సమాచారాన్ని పంపించారు. కానీ ఈడీ మాత్రం కవిత వినతిని తోసిపుచ్చింది. ఈడీ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో (Delhi) టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు
దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని(ED Kavitha) ఆరోపించారు. తీవ్రమైన బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని కవిత ప్రకటించిన విషయం విదితమే. ఈ కేసులో సాక్షిగా ఉన్న చందన్‌రెడ్డిని క్రూరంగా కొట్టారని, దాంతో ఆయన వినికిడి శక్తి కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై చందన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని, ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించారు. తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా సాక్షులను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని, కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ భయపెడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని అధికార పార్టీ ఇష్టం ప్రకారం ఈడీ తనకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని, తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధించడమేకాకుండా వాటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలొని ధర్మాసనం ఎదుట న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే తక్షణమే స్టే విధించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ చేపడతామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi ) కేంద్రంగా కవిత విషయంలో హైడ్రామా నడుస్తోంది. ఇవాళ ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను విచారణకు. పంపకుండా లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిణామాల నడుమ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read : ED Case on Kavitha: ఈడీ అరెస్ట్ నుంచి కవిత తప్పించుకోలేదా?

Related News

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు