HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavitha Comments On Harish Rao

Kavitha : హరీశ్ రావుపై మరో అవినీతి బాంబ్ పేల్చిన కవిత..!!

Kavitha : వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చుట్టూ కొత్త వివాదం చెలరేగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఈ ప్రాజెక్టు అమలులో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు

  • Author : Sudheer Date : 09-11-2025 - 4:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చుట్టూ కొత్త వివాదం చెలరేగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఈ ప్రాజెక్టు అమలులో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆమె ప్రకారం, ఆసుపత్రి నిర్మాణ పనులను నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ, మాజీ మంత్రి హరీశ్ రావు బినామీదేనని సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విషయంపై మీడియా స్వతంత్రంగా విచారణ జరపాలని సవాల్ విసిరారు. ప్రజా డబ్బుతో నిర్మాణం జరుగుతున్న ఇలాంటి ప్రాజెక్టుల్లో పారదర్శకత ఉండాలని, లేకపోతే అవినీతికి మార్గం సుగమమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

కవిత మాట్లాడుతూ, మొదట ఈ ప్రాజెక్టు ఖర్చు రూ. 1,100 కోట్లుగా అంచనా వేసినప్పటికీ, ఇప్పుడు అదే పనిని రూ.1,700 కోట్లకు పెంచారని తెలిపారు. ఖర్చు పెంపు వెనుక ఉన్న ఉద్దేశం స్పష్టంగా అవినీతి కేంద్రీకృతమైందని ఆమె వ్యాఖ్యానించారు. “ప్రజల ఆరోగ్య సేవల కోసం నిర్మించాల్సిన ఆసుపత్రి ఒకరికి లాభదాయక వ్యాపారంగా మారింది” అంటూ ఆమె మండిపడ్డారు. ఈ అవకతవకల వెనుక ఉన్న నిజాలను బయటపెట్టేందుకు ప్రభుత్వం లేదా ఏదైనా విచారణ సంస్థ ముందుకు రావాలని కవిత డిమాండ్ చేశారు.

ఇంతకుముందు కూడా కవిత, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని హరీశ్‌రావుపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ప్రాజెక్టు విషయంలో కూడా ఆమె సూటిగా ఆయనపైనే బాణాలు సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలతో బీఆర్ఎస్‌లో అంతర్గత ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, కవిత చేసిన ఈ సీరియస్ ఆరోపణలపై హరీశ్‌రావు లేదా బీఆర్ఎస్ నుంచి స్పందన కోసం అందరి చూపు నిలిచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harish rao
  • kavitha
  • warangal super speciality hospital

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd