Karimnagar Mayor Sunil Rao : బిజెపిలోకి బిఆర్ఎస్ కరీంనగర్ మేయర్..?
తాజాగా కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ మేయర్..బండి సంజయ్ ని కలవడం తో ఈయన త్వరలోనే బిజెపి లో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది
- By Sudheer Published Date - 06:40 PM, Sun - 14 July 24

గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు (BRS MLAS) ఒక్కొక్కరు గా కాంగ్రెస్ (Congress) లో చేరుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో బిజెపి (BJP) కూడా బిఆర్ఎస్ నేతలపై కన్నేసింది. ముందుగా బండి సంజయ్ (Bandi Sanjay) తన పార్లమెంట్ పరిధిలోని బిఆర్ఎస్ నేతలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి కారణంగా తాజాగా కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ మేయర్ (Karimnagar Mayor Sunil Rao)..బండి సంజయ్ ని కలవడం తో ఈయన త్వరలోనే బిజెపి లో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
కానీ ఈ ప్రచారాన్ని సునీల్ రావు (Mayor Sunil Rao) ఖండించారు. బండి సంజయ్ కేంద్రమంత్రి అయిన తర్వాత మొదటి సారి కరీంనగర్ కు రావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు కలిసినట్లు స్పష్టం చేసారు. అయితే, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సునీల్ రావు కొట్టిపారేశారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో చర్చిస్తానని బండి సంజయ్ హామీఇచ్చినట్లు, స్మార్ట్‌సిటీ పనులను మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని స్పష్టం చేసినట్లు సునీల్ తెలిపారు. మరోవైపు, బీజేపీ నేతలతో భేటీ కావడంపై బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
Read Also : SBTET : 2024-25 కోసం C-21 స్థానంలో కొత్త C-24 పాఠ్యాంశాలు