Physical Harassment : ప్రైవేటు ఆస్పత్రిలో యువతిపై లైంగికదాడి
Physical Harassment : కరీంనగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరిన ఓ యువతిపై లైంగిక దాడి జరిగినట్లు వెలుగుచూసింది. ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
- By Kavya Krishna Published Date - 12:32 PM, Mon - 8 September 25

Physical Harassment : కరీంనగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరిన ఓ యువతిపై లైంగిక దాడి జరిగినట్లు వెలుగుచూసింది. ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే—పొరుగు జిల్లాకు చెందిన ఓ యువతి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం కరీంనగర్‌లోని శ్రీదీపిక ప్రైవేట్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరింది. ఆమెను ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. అయితే ఆదివారం తెల్లవారుజామున డ్యూటీలో ఉన్న కాంపౌండర్ దక్షిణామూర్తి (24) బాధితురాలికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Rape : విశాఖలో అభంశుభం తెలియని మూగ ఆమ్మాయిపై అత్యాచారం!
ఈ విషయాన్ని యువతి ధైర్యం చేసి తన కుటుంబసభ్యులకు తెలియజేసింది. వెంటనే వారు కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశోధనలో భాగంగా పోలీసులు ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజీలు, బెడ్‌షీట్లు, ఘటనకు సంబంధించిన ఇతర వస్తువులను సీజ్ చేశారు.
అలాగే ఘటన జరిగిన సమయంలో ఎమర్జెన్సీ వార్డులో ఇతర రోగులు ఉన్నారా, డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ఎవరున్నారు అనే విషయాలను కూడా ఖరారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కరీంనగర్‌లో కలకలం రేగింది. ఆస్పత్రి భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వైద్యసంస్థలోనే ఇలాంటి దారుణం జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gold Price : దిగొచ్చిన బంగారం ధరలు