Kanti Velugu at Assembly: అసెంబ్లీలో ‘కంటి వెలుగు’.. ఎమ్మెల్యేలకు పరీక్షలు!
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది.
- By Balu J Published Date - 01:57 PM, Wed - 8 February 23

కంటి వెలుగు.. తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది. ఈ పథకానికి ఊహించనివిధంగా రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీలోనూ కంటి వెలుగు కార్యక్రమం జరిగింది.
అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటివెలుగు స్టాల్ ల వద్దకు ఎంఐఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్ లను స్వయంగా హరీశ్ రావు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కంటివెలుగు ప్రాముఖ్యతను వివరించారు. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉంది ఎం ఐ ఎం శాసన సభ్యులు అన్నారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ది కలిగించే అవకాశం ఉందని ఏంఐఎం ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసన సభ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమంను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ ను, మంత్రి హరీష్ రావులను ఎమ్మెల్యేలు అభినందించారు.

Related News

TSPSC: మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ.. జూన్ 17కు మార్పు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను TSPSC వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.