KA Paul : అల్లు అర్జున్ ప్లేస్ లో ఉంటె రూ.300 కోట్లు ఇచ్చేవాడ్ని – KA పాల్
KA Paul : రేవతి కుటుంబానికి రూ.300 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. నేనే అల్లు అర్జున్‌ను అయితే, ఆ 300 కోట్లే కాదు, నా సంపాదన మొత్తం ఇచ్చేవాడ్ని
- By Sudheer Published Date - 09:44 PM, Mon - 23 December 24

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తనదైన శైలిలో స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి రూ.50 లక్షలు ఇచ్చిన ‘పుష్ప 2’ నిర్మాతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రేవతి (Revathi) కుటుంబానికి రూ.300 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. “నేనే అల్లు అర్జున్‌ను అయితే, ఆ 300 కోట్లే కాదు, నా సంపాదన మొత్తం ఇచ్చేవాడ్ని ” అని కేఏ పాల్ తెలిపారు. రేవతి కుటుంబానికి మాత్రమే కాకుండా, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడికి కూడా తగిన ఆర్థిక సాయం అందించాలన్నారు.
తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి భర్త, కుటుంబసభ్యులను తక్షణమే క్షమాపణ కోరాలని, పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించాలని కేఏ పాల్ సూచించారు. రేవతి కుటుంబానికి లక్ష కోట్లు ఇచ్చినా, ఆ అమ్మాయిని తిరిగి తీసుకురాలేను. కానీ ఆ కుటుంబానికి బలమైన అండగా నిలబడవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో ఉన్న వారు ప్రజలకు రోల్ మోడల్‌గా నిలవాలని కేఏ పాల్ హితవు పలికారు. అక్కడి తో ఆగకుండా ఎప్పటిలాగానే తన నోటికి పనిచెప్పారు. నేను ఐదు లక్షల కోట్లు ప్రపంచవ్యాప్తంగా దానం చేశాను. లక్షలాది గృహాలు నిర్మించాను. అలాంటి దాతృత్వం చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా చూపాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఇదే క్రమంలో కేఏ పాల్ తన గౌరవాన్ని గాంధీ, అంబేద్కర్ వంటి మహానీయులతో పోల్చుకున్నారు. అమెరికా ప్రభుత్వం తనను గాంధీగా, మోడీ ప్రభుత్వం మహాత్మాగా గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ప్రెస్ మీట్‌లో జోకులు పేల్చి వార్తల్లో నిలిచారు.
Read Also : Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం