Jeevan Reddy : ఫిరాయింపులపై అధిష్టానానికి జీవన్ రెడ్డి లేఖ
Jeevan Reddy : సొంత పార్టీ నేతలకే రక్షణ లేదని మండిపడ్డారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై కూడా తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని
- By Sudheer Published Date - 12:55 PM, Thu - 24 October 24

కాంగ్రెస్ పార్టీ (Congress party) లో ఇప్పుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) అంశం కాకరేపుతుంది. నాల్గు రోజుల క్రితం ఆయన అనుచరుడ్ని దారుణంగా హత్య చేయడంతో జీవన్..సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. సొంత పార్టీ నేతలకే రక్షణ లేదని మండిపడ్డారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై కూడా తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని , కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు (congress deviation politics) వ్యతిరేకమని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఫిరాయింపుల కారణంగా బీఆర్‌ఎస్ ఎవరో.. కాంగ్రెస్ ఎవరో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు.
ఇదే అంశంపై మరోసారి జీవన్ రెడ్డి స్పందిస్తూ దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు. మానసిక ఆవేదనలో ఉన్నాను.. తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నా.. లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువ పాటించాలి. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నా. సంఖ్యా బలంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది..అలాంటి పార్టీ ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది..ఇది చాల బాదేస్తుందంటూ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.
Read Also : United Nations Day 2024 : ఇండియా వాంట్ ‘వీటో పవర్’.. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరిగేనా ?