HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jaya Jayahe Telangana In Textbooks

Telangana Anthem : ఇక పై పాఠ్యపుస్తకాల్లో “జయ జయహే తెలంగాణ”: విద్యాశాఖ ఆదేశాలు

ప్రముఖ కవి అందెశ్రీ రచించిన 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Author : Latha Suma Date : 11-12-2024 - 6:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
"Jaya Jayahe Telangana" in textbooks

Telangana Anthem : ఈసారి నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రచురించే పాఠశాల పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ గీతాన్ని చేర్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి(2025-26) ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర గేయాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి చెప్పారు.

కాగా, పాత సిలబస్‌తోనే వచ్చే విద్య సంవత్సరం కూడా పుస్తకాలను రెండు భాషల్లోనే ముద్రించనున్నారు. 2026-27 విద్య సంవత్సరం మాత్రం సిలబస్ మారుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈసారి పుస్తకాల్లో ఎలాంటి తప్పులు లేకుండా సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకోనున్నట్లు తెలిపారు. పిల్లలకు పుస్తకాలు ఎక్కువ బరువు కాకూడదనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రచయిత అందెశ్రీ రాసిన గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరం సమకూర్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు.

ఇకపోతే.. ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగేళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయతే ఈసారి మాత్రం పాత సిలబస్‌నే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలుగు-ఇంగ్లీష్, హిందీ-ఇంగ్లీష్, ఉర్దూ-ఇంగ్లీష్ ఇలా రెండేసి భాషల్లో పుస్తకాలను ముద్రిస్తున్నారు. పిల్లలకు పుస్తకాల బరువు పెరుగుతోందని భావించి.. భాషేతర పుస్తకాలను రెండు భాగాలుగా చేసి విద్యార్థులకు అందిస్తున్నారు.

Read Also: Railway Amendment Bill : రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Education Department orders
  • Telangana anthem
  • telangana government
  • Telangana School Books

Related News

We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

SIR కార్యక్రమంపై నేతలను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి SIR కార్యక్రమంలో చురుగ్గా లేని నేతలపై పార్టీ నివేదిక అందిస్తుంది పార్టీ ఆదేశాలను అమలు చేయడానికి నేతలకు 10 రోజుల గడువు హైదరాబాద్: SIR (ఓటర్ల జాబితా సవరణ/పరిశీలన) కార్యక్రమం అమలులో పార్టీ సూచనలను పాటించని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు పార్టీ నేతలతో SIR అంశం

  • Sanjay Jaju appointed as Telangana's new Chief Secretary; to assume charge on June 30.

    Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు..జూన్ 30న బాధ్యతల స్వీకరణ

Latest News

  • Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

  • Mumbai Rains: ముంబై మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి

  • Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

  • Elders Blessings: పెద్దల పాదాలకు ఎందుకు నమస్కారం చేయాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?

  • Gade Sai Krishna: సాయి కృష్ణ డెత్ పై.. SIT సంచలన రిపోర్ట్

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd