Janasena : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ..?
పవన్ కళ్యాణ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో పోటీ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది
- Author : Sudheer
Date : 13-04-2024 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన పార్టీ (Janasena Party) తెలంగాణ (Telangana) లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందా.. ? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో పోటీ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫోకస్ అంత కూడా ఏపీ ఎన్నికలపైనే పెట్టాడని అంత అనుకుంటూ వచ్చాం. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి ఎలాగైనా విజయం సాదించి, జగన్ ను గద్దె దించాలని చూస్తున్నాడు. అందుకే బిజెపి , టిడిపి తో పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగుతుంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం..ప్రచారం మొదలుపెట్టడం చేసారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్..తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కూడా జనసేన బరిలోకి దిగబోతుందా అనే చర్చ మొదలైంది.
We’re now on WhatsApp. Click to Join.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన , బిజెపి తో కలిసి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఏడు స్థానాల్లో పోటీ చేసిన కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మరి ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుందనే వార్తలు వినిపిస్తుండడం తో చాలామంది అవసరమా అని సలహా ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే డిపాజిట్ రాలేదు. ఇక లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు పడతాయా..? ఎందుకు పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం అని అంటున్నారు. మరి నిజంగా జనసేన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా..? లేదా అనేది చూడాలి.
Read Also : Riddhi Patel Arrested: కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన మహిళ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?