Janareddy : జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానం
అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లు సర్దుబాటు చేయడం, ఎవరైనా సీట్ ఇవ్వలేదని అలిగితే వారిని బుజ్గించడం లాంటి కీలక కర్తవ్యాలను జానా రెడ్డికి ఇచ్చింది
- By Sudheer Published Date - 04:07 PM, Wed - 11 October 23

తెలంగాణ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections 2023) జరగబోతున్నాయి. నవంబర్ 30 న ఎన్నికల పోలింగ్ , డిసెంబర్ 03 న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు (All Political Parties) ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటీకే అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ప్రచారాన్ని మొదలుపెట్టగా..కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) పార్టీలు సిద్ధం అవుతున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం..పార్టీ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy ) కి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లు సర్దుబాటు చేయడం, ఎవరైనా సీట్ ఇవ్వలేదని అలిగితే వారిని బుజ్గించడం లాంటి కీలక కర్తవ్యాలను జానా రెడ్డికి ఇచ్చింది. ఇందుకోసం కాంగ్రెస్ ఫోర్ కమిటీ ని ఏర్పాటు చేసింది. ఆయనతోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, దీపా దాస్ మున్షి, మీనాక్షి నటరాజన్‌లతో ఈ కమిటీని నియమించింది. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన తరువాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈరోజు గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన సమావేశమై అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ హావ గతంతో పోలిస్తే బాగా పెరిగింది. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలు (Congress Guarantee Schemes) , రెండుసార్లు బిఆర్ఎస్ కు అధికారం ఇచ్చాం..ఈసారి కాంగ్రెస్ పనితనం కూడా చూద్దాం అనే ఆలోచన ప్రజల్లో కలగడం..మరోపక్క అధికార పార్టీ తో పాటు ఇతర పార్టీల నుండి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరుతుండడం తో ఈసారి తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా అధిష్టానం భావిస్తుంది. అందుకే ఎక్కడ ఎలాంటి తప్పులు , గొడవలు జరగకుండా పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఈసారి తెలంగాణ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను అధిష్టానం చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Read Also : Note For Vote Case : ఓటుకు నోటు కేసు.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు