Jagga Reddy: రేవంత్ తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి, బీఆర్ఎస్ లోకి జంప్?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే ‘జగ్గా’రెడ్డి పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- By Balu J Published Date - 03:13 PM, Fri - 18 August 23

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే ‘జగ్గా’రెడ్డి పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని పార్టీ మార్పుపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, జగ్గా రెడ్డి మాత్రం బీఆర్ఎస్ మంత్రులను కలవడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జగ్గారెడ్డి ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీకి హాజరయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన తర్వాత బయటి వ్యక్తులకు పదవులు ఇస్తున్నారని ఆయన వాపోయినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిపై ఆయన పలు ప్రతికూల వ్యాఖ్యలు చేయడంతో ఆయన అరెస్టుపై ఊహాగానాలు చెలరేగాయి. 2004లో బీఆర్‌ఎస్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత బీజేపీలో చేరి కొన్నాళ్లకు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. జగ్గారెడ్డి కూడా తన నియోజక వర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా పార్టీ మారుతున్న అంశాన్ని స్పష్టం చేశారని తెలిసింది.
తనపై అభిమానం ఉన్నవారు రావచ్చని, తాను మాత్రం ఒత్తడి చేయనని పార్టీ కేడర్‌కు చెప్పినట్లుగా తెలిసింది. అంతే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు తెల్లం వెంకట్రావ్ గురువారం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డికి మొదటి నుంచి పొసగడం లేదు. పార్టీ కార్యక్రమాల నిర్ణయం, అమలు విషయంలో రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి పలుమార్లు బహటంగానే విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం జగ్గారెడ్డి కేటీఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడటం కూడా చర్చనీయాంశమైంది.
Also Read: Richest Actress: ఆసియాలో రిచెస్ట్ హీరోయిర్ ఎవరో తెలుసా, 900 కోట్ల ఆస్తులతో టాప్ ప్లేస్