KTR Controversy : ప్రవక్త వివాదంలోకి మంత్రి కేటీఆర్
మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యల క్రమంలో నడుస్తోన్న వివాదంలోకి మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు.
- By CS Rao Published Date - 02:47 PM, Mon - 6 June 22

మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యల క్రమంలో నడుస్తోన్న వివాదంలోకి మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ నేతలు చెసిన వ్యాఖ్యలకు భారత్ క్షమాపణ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు చేసిన విద్వేష వ్యాఖ్యలకు అంతర్జాతీయ సమాజానికి భారత దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలంటూ మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీజేపీ క్షమాపణలు చెప్పాలని, ఓ దేశంగా భారత్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Modi Ji, Your silence was deafening & shocking when BJP MP Pragya Singh hailed assassination of Mahatma Gandhi
Let me remind you sir; What you permit is what you promote
The tacit support from top is what emboldened the bigotry & hatred that will cause irreparable loss to 🇮🇳 pic.twitter.com/VSgHd6P2Hh
— KTR (@KTRBRS) June 6, 2022
నిత్యం విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు తొలుత భారతీయులకు క్షమాపణలు చెప్పాలి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నేతలను కేంద్రంలోని బీజేపీ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఆ పార్టీపై విమర్శలు ఆగడంలేదు. తాజాగా ఈ వివాదంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తే బీజేపీ తప్పు చేస్తే, భారత్ ఎందుకు క్షమానణలు చెప్పాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ కేటీఆర్ సోమవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.