TRS Party: టీఆర్ఎస్ నాయకులపై తుమ్మల అసంతృప్తి
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఒకప్పుడు జిల్లాను ఏలిన వ్యక్తి.
- Author : Siddartha Kallepelly
Date : 28-05-2022 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఒకప్పుడు జిల్లాను ఏలిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో చక్రం తిప్పిన వ్యక్తి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పదవి లేకపోయేసరికి ఎవరు పట్టించుకోవడం లేదని, కేసీఆర్ తో గ్యాప్ వచ్చిందని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన పార్టీ మారనున్నారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే తన పరిస్థితి గూర్చి చెప్పుకున్న తుమ్మల సొంత పార్టీ వాళ్ళవల్లే ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు. రాజకీయ శత్రువులు పక్క పార్టీలోకి వెళ్లిపోతారని కానీ ద్రోహులు మాత్రం పార్టీలోనే ఉండి ద్రోహం చేసి ఓడిస్తారని ఆయన పేర్కొన్నారు. పాలేరులో పాలేరుగా పని చేసి, మూడేళ్ళలో ఎంతో అభివృద్ధి చేసానని కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తనకి మళ్ళి మంచి రోజులు వస్తాయని అప్పటిదాకా ఓపికగా ఉంటానని తెలిపారు.