Telangana Secretariat : తెలంగాణ సచివాలయానికి ఇంటర్నెట్ కట్ – ఎందుకో తెలిస్తే నవ్వుకుంటారు
ఏదో టెక్నీకల్ ప్రాబ్లమ్ అనుకోని వెయిట్ చేసారు..అయినాగానీ రాలేదు. ఏంటి అని ఆరాతీయగా..పెండింగ్ బిల్లులు కట్టడం లేదని ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలిసి షాక్ అయ్యారు
- By Sudheer Published Date - 03:17 PM, Tue - 16 July 24

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ (Congress ) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి చాలా కటింగ్ లు జరుగుతున్నాయి. ముఖ్యముగా కరెంట్ కటింగ్ లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పైకి ఎక్కడ కరెంట్ కటింగ్ లు జరగడం లేదని కాంగ్రెస్ నేతలు చెపుతున్నప్పటికీ..వారు సమావేశం జరుపుతున్న క్రమంలో కరెంట్ పోవడం..ఇక ఇప్పట్లో రాదా..? అని ప్రశ్నించిన సందర్భాలు కూడా వచ్చాయి. తాజాగా తెలంగాణ సచివాలయానికి (Telangana Secretariat) ఇంటర్నెట్ కట్ (Internet Cut )అవ్వడం ఇప్పుడు చర్చ గా మారింది. ప్రస్తుతం ఇప్పుడు అన్ని చోట్ల ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. చేతిలో ఫోన్ ఎలాగో…ఆఫీస్ లలో , షాప్స్ లలో ఇంటర్నెట్ అనేది కామన్ గా మారింది. సెకన్ల ఇంటర్నెట్ ఆగిపోయిన ఏదో జరిగిపోయిందనేలా అయిపోతున్నారు జనాలు.
We’re now on WhatsApp. Click to Join.
అలాంటిది తెలంగాణ సచివాలయంలో అది కూడా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కలెక్టర్లతో ముఖ్య సమావేశం జరుపుతుండగా ఇంటర్నెట్ కట్ అవ్వడం చర్చ కు దారితీసింది. ఏదో టెక్నీకల్ ప్రాబ్లమ్ అనుకోని వెయిట్ చేసారు..అయినాగానీ రాలేదు. ఏంటి అని ఆరాతీయగా..పెండింగ్ బిల్లులు కట్టడం లేదని ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలిసి షాక్ అయ్యారు. వంద ,వెయ్యి , లక్ష కాదు ఏకంగా రూ.కోట్లలో పెండింగ్ బిల్లులు ఉండటంతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారట. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలంటూ ‘నిపుణ’ నెట్వర్క్ విజ్ఞప్తి చేసినా చెల్లించకపోవడంతో ఇంటర్నెట్ కట్ చేసినట్లు సమాచారం. దీంతో పలు శాఖల సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు విషయం సీఎం దృష్టికి రావాలంటే ఇలా సమావేశం జరుపుతుండగా కట్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ దెబ్బ తో పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయా..లేక కొత్త కనెక్షన్ తీసుకున్నారా అనేది చూడాలి.
Read Also : Vijaysai Reddy : విజయసాయి రెడ్డి కి అధికారం పోయినా అహంకారం తగ్గలేదు – నారా లోకేష్