Harish Rao: మెడికల్ కాలేజీల విషయంలో తీవ్ర అన్యాయం: హరీశ్ రావు
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
- By Balu J Published Date - 05:13 PM, Sun - 5 March 23

మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో పలు కీలక విషయాలపై మాట్లాడారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా మొండి చేయి చూపిందని అన్నారు. ఒకటో ఫేస్ , రెండో ఫేస్ లో ఇవ్వలేదు, మోడో ఫేస్ లో ఇస్తామని చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించిందిని మంత్రి హరీశ్ రావు అన్నారు.
‘‘మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే, మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజ్ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేకపోయాము అని చెబుతారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.
‘‘కేంద్రం మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్ గారు రాష్ట్రం సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలు ప్రారంబించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉండటం వాస్తవం కాదా? .. ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా’’ మంత్రి అన్నారు.
‘‘గతంలో బీబీనగర్ ఎయిమ్స్ కి తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఒక కేంద్ర మంత్రి నాలుక కరుచుకున్నరు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. డిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకు గల్లీ లోని మా పి హెచ్ సి స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉంది? రూ. 1365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ. 156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు? ఇదే సమయంలో అంటే 2018 లో మంజూరు అయిన గుజరాత్ ఎయిమ్స్ కి 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా? ఏపీ పునర్ విభజన చట్టం -2014 లో ఇచ్చిన హామీల మేరకు ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్ భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినవారు అవుతారు’’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Related News

Somu Veerraju: ఏపీ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుంది: సోము వీర్రాజు
ఇటీవల ఏపీ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదా కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు రియాక్ట్ అవుతూ.. ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుందని అన్నారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలంటూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. సోమవారం విజయవాడలోని ధర్నా చౌ