Rana Daggubati : రంగంలోకి రానా ‘సౌత్‌బే’.. హైదరాబాద్‌లో బాక్సింగ్ ఈవెంట్స్
Rana Daggubati : మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) , ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (IBC) కీలక నిర్ణయం తీసుకున్నాయి.
- By Pasha Published Date - 03:36 PM, Mon - 19 February 24
Rana Daggubati : మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) , ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (IBC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం ప్రముఖ హీరో రానా దగ్గుబాటికి చెందిన సౌత్‌బే యూట్యూబ్ ఛానల్‌తో జట్టు కట్టింది. IPBL, IBCలు మన హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు ‘ఫైట్ నైట్స్’ నిర్వహించనున్నాయి. ఫిబ్రవరి 29, మార్చి 7, 14, 28 తేదీల్లో బాక్సింగ్‌బే ఫైట్ నైట్స్‌కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టాప్- 20 ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో పాల్గొంటారు. ఈ ఈవెంట్స్‌ను ‘సౌత్‌బే’ యూట్యూబ్ ఛానల్ ద్వారా రానా దగ్గుబాటి (Rana Daggubati ) ప్రమోట్ చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- హైదరాబాద్‌లో నిర్వహించబోయే నాలుగు ఫైట్ నైట్‌లలో మొదటి దాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ప్రోస్ట్ బ్రూపబ్‌లో ఫిబ్రవరి 29న నిర్వహిస్తారు.
- రెండో, మూడో, నాలుగో ఫైట్ నైట్‌లను నగరంలోని పలు బ్రూవరీ, క్లబ్‌లు వేదికగా నిర్వహిస్తారు. ప్రస్తుతం వాటి ఎంపిక జరుగుతోంది.
Also Read :Zomato – Ecommerce : ఈ-కామర్స్‌లోకి జొమాటో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీ
‘‘బాక్సింగ్‌బే అనేది బాక్సింగ్‌కు మన దేశంలో ప్రాచుర్యం కల్పించడానికి చేస్తున్న ప్రయత్నం. ఇందులో భాగంగా మేం పాఠశాలలు, కళాశాలలు, మాల్స్, కమ్యూనిటీ ఈవెంట్‌లను కూడా నిర్వహించబోతున్నాం. ఇంతకుముందు వరకు బ్రూవరీలు, క్లబ్‌లలోనే ఫైట్ నైట్‌లు జరిగేవి. ఇకపై మేం ఆ పరిధిని విస్తరించబోతున్నాం. ప్రజలను దానితో కనెక్ట్ చేయబోతున్నాం’’ అని IBC ప్రెసిడెంట్ బ్రిగేడియర్ PMK రాజా తెలిపారు.