Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా.. ఎందుకంటే..?
తెలంగాణ కొత్త సచివాలయ భవనం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాయిదా పడింది. ఈ నెల 17న కొత్త సచివాలయం భవనం ప్రారంభించాల్సి ఉంది.
- Author : Gopichand
Date : 11-02-2023 - 8:43 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ కొత్త సచివాలయ భవనం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాయిదా పడింది. ఈ నెల 17న కొత్త సచివాలయం భవనం ప్రారంభించాల్సి ఉంది. త్వరలో ప్రారంభ తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ నెల 17న ప్రారంభించాల్సి ఉంది. అయితే తాజాగా నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: Formula E Championship: నేడు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్.. హుస్సేన్‌సాగర్ తీరాన రయ్.. రయ్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా.. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.